Read more!

English | Telugu

కార్స్ ట్రెండ్ కాదు...మెషీన్స్ మాత్రమే ట్రెండింగ్ 

గోరింటాకు సీరియల్ నటులు కావ్యశ్రీ, నిఖిల్ గురించి అందరికీ తెలుసు. స్టార్ మా లో ప్రసారమైన గోరింటాకు సీరియల్ కూడా ఎంతో ఫేమస్. ఈ సీరియల్ కు తెలుగు ప్రేక్షకులు మంచి అభిమానం చూపిన్చచారు. వీరు రీల్ లైఫ్ లో ఎంత చూడముచ్చట జంటగా ఉంటారో రియల్ లైఫ్ లో కూడా వీరిని అలాగే చూడాలని అనుకుంటున్నారు వీరి అభిమానులు. అలాంటి ఈ జంట కొంత కాలంగా ఎక్కడా కనిపించడం లేదు. ఐతే కావ్య మాత్రం ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ఫార్మ్ లో ఉంది.

రీసెంట్ గ ఒక కార్ కొనుక్కుంది. అది కూడా మహేంద్ర వారి థార్...దాని కాస్ట్ సుమారు 17 లక్షల వరకు ఉంది. దీన్ని వీడియో చేసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. వెల్కమ్ హోమ్ బేబీ 2  అని చెప్పింది. నెటిజన్స్ కూడా కావ్యకు విషెస్ చెప్తున్నారు. ప్రియాంక జైన్, రక్షా గౌడ కూడా కంగ్రాట్యులేషన్స్ చెప్పారు. ఐతే ఒక నెటిజన్ "మీకు కార్ డ్రైవింగ్ వచ్చా" అని అడిగారు. "గువ్వా గోరింకా సీరియల్ లో, అహ నా పెళ్ళంటా వెబ్ సిరీస్ లో ఆమె డ్రైవింగ్ చూడలేదా" అని మరో నెటిజన్ రిప్లై ఇచ్చారు. "అమ్మాయిలంతా మెషీన్లనే కొంటున్నారు" అని మరో నెటిజన్ అనేసరికి "ఈ జనరేషన్ లో కార్స్ ట్రెండ్ కాదు మెషీన్స్ మాత్రమే ట్రెండింగ్" అని ఆన్సర్ ఇచ్చింది. ఇక వీళ్ళు నీతోనే డాన్స్ సీజన్ 1 లో పార్టిసిపేట్ చేశారు. అలాగే అప్పుడప్పుడు ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇంకా మరింత హార్డ్ వర్క్ చేసి మరిన్ని కార్లు కొనాలి అంటూ ఎందరో విషెస్ చెప్తున్నారు. ఇక కార్ కొన్న సందర్భంగా కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకుంది.