Read more!

English | Telugu

గీతు, ఆదిరెడ్డి మధ్య క్లాషెస్ వచ్చాయా?

బిగ్ బాస్ సీజన్-6 తో ఫేమ్ సంపాదించుకున్న వారిలో గీతు రాయల్ ఒకరు. బిగ్ బాస్ కి వెళ్ళకముందు ఒక రివ్యూయర్ గా ఉండి తనకు నచ్చిన వీడియోలని యూట్యూబ్ లో అప్లోడ్ చేసే ఒక సాధారణ యూట్యూబర్. అలా బిగ్ బాస్ సీజన్-5కి రివ్యూ చేసి.. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్-6 లో ఛాన్స్ కొట్టేసింది గీతు.‌ బిగ్ బాస్ లో‌కి అడుగుపెట్టినప్పటి నుండి తన యాటిట్యూడ్ తో హౌస్ మేట్స్ తో గొడవలు పెట్టుకుంటూ, తనదే నెగ్గాలన్న వైఖరితో  ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది. దాంతో ఎక్కువ ఫ్యాన్ బేస్ సంపాదించుకోలేకపోయింది. ఆ తర్వాత అనుకోకుండా ఎలిమినేట్ అయి బయటికి వచ్చేసింది గీతు.

బిగ్ బాస్ తో ఫేమ్ వచ్చినా కూడా తనకి తగినన్ని అవకాశాలు రాకపోవడం గీతూకి నిరాశ కలిగించింది. దీంతో చిన్న చిన్న ఈవెంట్స్ లో సైతం పాల్గొంటూ.. బిగ్ బాస్ రీ యూనియన్ పేరుతో వ్లాగ్ లు చేస్తూ తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తుంది. అయితే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో 'ఆస్క్ మీ క్వశ్చన్.. లెట్స్ ఫన్' అంటూ తన స్టేటస్ లో పోస్ట్ చేసింది. గీతు అభిమానులు కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడగగా.. వాటిలో‌ కొన్నింటికి తనదైన స్టైల్ లో సమధానాలు తెలిపింది‌ గీతు. మీకు ఆదిరెడ్డికి క్లాషెస్ వచ్చాయా? చాలా మందికి ఉన్న ఒక డౌట్ ఇది.. క్లారీఫై చెయ్యండని ఒక అభిమాని అడుగగా... క్లాషెస్ అంటూ ఏం లేవు. తన పనుల్లో బిజీగా ఉన్నాడు.. కలవడం కుదరట్లేదు అంతే. నాకేమైనా ప్రాబ్లెమ్ వస్తే తనే ముందుంటాడని క్లారిఫై చేసింది గీతు. మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరని మరొకరు అడుగగా.. ఒక ఏజ్ వచ్చాక ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్ లా అనిపించరేమో అంటూ సమాధానం ఇచ్చింది గీతు. మీ జీవితంలో జరిగిన పెద్ద విషాదకర సంఘటన ఏంటని ఒకరు అడుగగా.. మా అన్న చనిపోవడం, బిగ్ బాస్ ఎలిమినేషన్, నా ఫేవరెట్ పర్సన్ టర్నింగ్ ఇన్ టూ బిగ్గెస్ట్ లెస్సన్ ఫర్ లైఫ్ అంటూ సమాధానమిచ్చింది గీతు.

ఆర్జే సూర్య బ్లెస్సింగ్ రా నానా.. అని మెసేజ్ చేయగా.. "రేయ్ నానా.. నీ ఫేస్ నాకు చూపించకు. ఐ డోంట్ లైక్ ఇట్. బిబి జోడి విన్నర్ అంట.. ఒక చిన్న పార్టీ లేదు. పెద్దొళ్ళు అయ్యిపోయారురా నానా.. మేమెక్కడ గుర్తుంటాంలే ఇంకా.. మనం 8th week, 9th week ఎలిమినేషన్ బ్యాచ్ రా .. అది మర్చిపోకురా నానా.." అంటూ సమాధనమిచ్చింది గీతు. బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక మొదట్లో ఆదిరెడ్డి, అతని భార్య కవితతో కలిసి కొన్ని వీడియోలు తీసి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది గీతు. కాగా ఇప్పుడు అలాంటివేం లేకపోవడంతో ఆదిరెడ్డి, గీతూలకి క్లాషెస్ వచ్చాయేమోనని కొందరు అనుమానం వ్యక్తం చేస్తుండగా.. గీతు మాత్రం అలాంటివేం లేవంటుంది.