Read more!

English | Telugu

ఆ సీన్ చూసి చాలా ఏడ్చానని చెప్పిన గలాటా గీతు!


గలాటా గీతు.. ఇప్పుడు ఈ పేరు అందరికి సుపరిచితమే. గీతూ బిగ్ బాస్ రివ్యూవర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసి ఏకంగా బిగ్ బాస్-6 లో కంటెస్టెంట్ గా ఛాన్స్ కొట్టేసింది. తను బిగ్ బాస్ లోకి వెళ్ళాక కంటెస్టెంట్స్ తో ఎప్పుడు గొడవలు పెట్టుకునేది. తన ఆటిట్యూడ్ తో ప్రేక్షకులకు దగ్గర కాలేకపోయింది. దాంతో కొన్నివారాలకే బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయింది. ఆ టైంలో హౌస్ ని విడిచిపోను అంటూ ఎమోషనల్ అయింది.

గీతు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకొచ్చాక ఆదిరెడ్డి వాళ్ళ సొంత ఊరికి కూడా వెళ్ళింది. ఇలా తనకు సంబంధించిన అప్డేట్స్ ని వీడియోల రూపంలో ఇటు యూట్యూబ్ ఛానెల్ లోను.. అటు ఇన్ స్టాగ్రామ్ లోను పోస్ట్ చేస్తుంది. కాగా బిగ్ బాస్ లోకి వెళ్ళి వచ్చినవాళ్ళలో దాదాపు అందరూ ఫేమ్ వచ్చి వరుస అవకాశాలతో బిజీగా ఉంటున్నారు. గీతూకి మాత్రం ఫేమ్ వచ్చినా అవకాశాలు రావట్లేదు. తనతో పాటు హౌస్ లోకి వెళ్ళిన మిగతావారు ఏదో ఒక షో లో మెరుస్తున్నారు. కాగా గీతూ తన యూట్యూబ్ వ్లాగ్ లతో బిజీ అయిపోయింది. ఆదిరెడ్డి బిగ్  బాస్ నుండి కొన్ని మెమోరీస్  తీసుకురాగా.. ఆ మెమోరీస్ అన్నీ చూపిస్తూ ఆ సీన్స్ ని చెప్తూ..  బిగ్ బాస్ మెమోరీస్ అని ఒక వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేసింది. ఆదిరెడ్డి, కవితలతో కలిసి కొన్ని ఫొటోస్ చూపిస్తూ ఎమోషనల్ అయింది. ఇక ఆదిరెడ్డి ఫ్యామిలీ హౌస్ లోకి వచ్చినప్పుడు ఆదిరెడ్డి ఎమోషనల్ అయిన ఫొటోని చూపిస్తూ.. "ఆ సీన్ ని చూసి చాలా ఏడ్చాను. నేను అప్పుడు అక్కడ లేను.. నేను దగ్గర ఉండి చూడలేకపోయాను.. ఇంకా మా అమ్మని ఫ్యామిలీ వీక్ లో తీసుకురాలేదు" అంటూ గీతు చెప్పుకొచ్చింది. మరికొన్ని ఫొటోస్ చూపిస్తూ ఇవే తాను ఎలిమినేట్ కావడానికి కారణం అయ్యాయని చెప్పింది.

గీతు సరదాగా మాట్లాడుతూ కొన్ని ఫొటోస్ చూపించిన తర్వాత వీడియో ఆపేసి ఏడ్చేసింది. ఇలా తన ఎమోషనల్ జర్నీ సాగిందంటూ బిగ్ బాస్ లోని కొన్ని మెమోరీస్ ని పంచుకుంది. ఆ వీడియోని చూసిన నెటిజన్లు.. "గీతు, ఆదిరెడ్డిల ఫ్రెండ్ షిప్ బాండింగ్ సూపర్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.