Read more!

English | Telugu

ఎట్టకేలకు గౌతమ్ నందుల పెళ్ళి జరిగింది.. భవానీకి మిగిలిన కడుపుకోత!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సరికొత్త మలుపుతో మంగళవారం నాటి ఎపిసోడ్ -140లో.. భవాని ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత  నన్ను మోసం చేశారంటూ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కాసేపటికి హాల్లో ఉన్న అందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కృష్ణ, మురారి ఇద్దరూ కలిసి గౌతమ్, నందులని పెళ్లిపీటలపై కూర్చోబెట్టి వాళ్ళ పెళ్ళి జరిపిస్తారు.

మరొకవైపు భవాని, ఈశ్వర్, ప్రసాద్ లు ఇంటికి వస్తారు. అప్పుడే ఇంట్లోని హాల్‌లో టెన్షన్ పడుతున్న రేవతి వాళ్ళని చూస్తుంది. ఏమైంది అక్క.. నందు వాళ్ళు ఎక్కడ అని అడుగుతుంది. అంతా తెలిసే ఇలా అడుగుతున్నావా? అని రేవతిపై ఈశ్వర్ కోప్పడతాడు. నాకు తెలిస్తే నేను మళ్ళీ అక్కని ఎందుకు అడుగుతానని రేవతి అంటుంది. అంతలోనే కృష్ణ, మురారిలు వస్తారు. మురారి రావడంతోనే పెద్దమ్మ అని భవానిని పిలుస్తాడు. నన్ను అలా పిలవద్దని భవాని ఎమోషనల్ అవుతుంది. నాకు ఈ రోజుతో కూతురుతో పాటు కొడుకు కూడా లేడు.. ఈ రోజు నుండి ఈ ఇంటిని ఇంట్లో వాళ్ళని నేను పట్టించుకోవడం లేదు.. నిన్ను రేవతి కన్నది.. పెంచింది మాత్రం నేనే.. నీ భార్య మాటలు విని నా పరువు తీస్తావా అని భవాని ఆవేశపడుతుంది. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు పెద్దమ్మ.. నా చెల్లి గురించి అలోచించి మాత్రమే నేను ఇలా చేశాను. దయచేసి మీరు అలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి. మీరు నేను చేసిన తప్పుకి ఏ శిక్ష అయినా వెయ్యండని మురారి అంటాడు. ఏసీపి సర్ ఏ తప్పు చెయ్యలేదు.. అంతా నేనే చేశాను.. కావాలంటే నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టండని కృష్ణ అనగానే..  నా పెంపకంలో పెరిగిన నా కొడుకు నమ్మకద్రోహం చేసాడు.. వీడు నా కొడుకే కాదని భవాని అంటుంది.

భవాని అలా అనేసరికి మురారి బాధగా చూస్తాడు. నాకింతటి కడుపు కోత మిగిల్చిన వీళ్ళిద్దరితో ఇంట్లో ఎవరు మాట్లాడొద్దని భవాని అందరికి చెప్తుంది. మీరు మాట్లాడకపోతే నేను ఏమైపోవాలి పెద్దమ్మ అని మురారి అంటాడు. నాకు అవసరం లేని వాళ్ళు ఏమైపోతే నాకేంటని భవాని కఠినంగా మాట్లాడుతుంది. "అక్క చిన్నప్పటి నుండి నువ్వు పెంచావ్.. నువ్వు ఇప్పుడు అలా అంటే వాడు ఏమైపోతాడు" అని రేవతి అంటుంది. మానసికంగా మిమ్మల్ని వెలివేస్తున్న అని భవాని అంటుంది. మురారి ఎంత చెప్పినా వినకుండా భవాని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అందరు ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. మురారి, కృష్ణ లు మాత్రమే అక్కడే ఉండిపోతారు.మురారితో ఇంట్లో ఎవరు మాట్లాడకూడదంటే నేను కూడా వస్తాను కదా.. మురారితో మాట్లాడకుండా ఎలా ఉండాలని ముకుంద బాధపడుతుంది. ఆ తర్వాత  ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.