Read more!

English | Telugu

అమ్మనాన్నలని ఫస్ట్ టైమ్ విమానం ఎక్కించిన ఎక్స్‌ప్రెస్ హరి!

ప్రతి కొడుకు డ్రీమ్.. తన అమ్మనాన్నలని సిటీ అంతా చూపించాలని, వారికి నచ్చినవన్నీ తినిపించాలని.. ఇలాంటి చిన్నచిన్న కోరికలతో ఎంతో మంది ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ సిటీలో బ్రతికేస్తుంటారు. అదే ఓ రోజున వాళ్ళ అమ్మనాన్నలు వస్తే వారికి సిటీలోని అన్ని చూడదగ్గ ప్రదేశాలు చూపించాలనుకుంటారు.

అయితే విమానాలని సినిమాలో తప్ప బయట చూడనివారు ఎంతో మంది ఉన్నారు. అలాంటిది ఒక్కసారి అయినా లైఫ్ లో విమానం ఎక్కాలని ప్రతీ ఒక్కరు అనుకుంటారు. అదేంటంటే తన అమ్మనాన్నలని ఫ్లైట్ ఎక్కించానని, అది తన డ్రీమ్ అని ఎక్స్ ప్రెస్ హరి ఓ వ్లాగ్ లో చెప్పుకొచ్చాడు. కొంతకాలం క్రితం 'కామెడీ స్టార్స్' షో ద్వారా అషూ రెడ్డి, ఎక్స్ ప్రెస్ హరి జోడి బాగానే వైరల్ అయింది. ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్‌లోనూ ఈ ఇద్దరూ రచ్చ చేసారు. దాంతో నెటిజన్లు వీరిద్దరిని కలిపి తెగ ట్రోల్స్ చేశారు. మొదటగా వర్ష, ఇమ్మాన్యుయల్ జంటని నెటిజన్లు ట్రోల్స్ చేయగా‌. ఆ  జంటలాగే సోషల్ మీడియాలో కామెడీ స్టార్స్ ద్వారా ఫేమస్ అయిన వీరిద్దరికి భారీగా ట్రోల్స్ వచ్చేశాయి. దాంతో వీరిద్దరు గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. 

కొంతకాలం క్రితం ఎక్స్ ప్రెస్ హరి సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ని క్రొయేట్ చేశాడు. అందులో తన అనుభవాలని పంచుకుంటున్నాడు. ఫస్ట్ బస్ జర్నీ, ఫస్ట్ ట్రైన్ జర్నీ, ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అన్నీ ప్రతీఒక్కరికి ఒక డ్రీమ్ గా ఉంటాయి. అలాగే హరి తన అమ్మనాన్నలని వైజాగ్ ఎయిర్ పోర్ట్ కి తోసుకొచ్చాడు. మొదటగా ఎయిర్ పోర్ట్ చూపించి ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కించాడు హరి. అసలు వారి ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇది ప్రతీ కుర్రాడి డ్రీమ్ అని చెప్తూ ఎక్స్ ప్రెస్ హరి చేసిన ఈ వ్లాగ్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మరి మీలో ఎంతమంది మీ అమ్మనాన్నలని ఫస్ట్ ఫ్లైట్ ఎక్కించారో కామెంట్ చేయండి.