Read more!

English | Telugu

డిజె టిల్లు 2 ని రెండు సార్లు చూసా...


జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఫైమా. ఆ క్రేజ్ తోనే  బిగ్ బాస్ షో సీజన్ 6 కి వెళ్ళింది. అక్కడ అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది ఫైమా. అలాంటి ఫైమా ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. రీసెంట్ గా "ఆస్క్ మీ ఏ క్వశ్చన్ " తో ఫాన్స్ ముందుకు వచ్చింది. ఇక నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఫైమా కూడా ఆన్సర్స్ ఇచ్చింది. "డిజె టిల్లు 2 చూసాక నువ్వు ఎలా ఫీలయ్యావ్" అని ఒక నెటిజన్ అడిగారు. "రెండు సార్లు చూసా చాలా ఫన్నీగా ఉంది..బాగా ఎంజాయ్ చేశా" అని చెప్పింది. "నువ్వు తన్వి అక్క చేసిన రీల్ లో నువ్వు వేసుకున్న షర్ట్ నాకు బాగా నచ్చింది ఇస్తావా అక్కా ప్లీజ్" అని ఒక నెటిజన్ అడిగింది.

"సరే ఎప్పుడు తీసుకుంటావో చెప్పు ఇచ్చేస్తా" అని అంది ఫైమా. "మీ లైఫ్ లో మొయే మొయే మూమెంట్ ఎప్పుడో చెప్పు ఫైమా" అనేసరికి "ఏప్రిల్ 16 న అని నవ్వే ఎమోజిని" పెట్టింది ఫైమా. "దుబాయ్ లో వర్షం పడుతుందా అక్కా" అని అంటే "మేము వచ్చేసాము" అని చెప్పింది. ఫైమా కొన్నిరోజులుగా రీల్స్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తోంది. సత్యతో, ప్రవీణ్ నాయక్ తో, తన్వి జైన్ తో కలిసి ట్రెండింగ్ సాంగ్స్ కి డాన్స్ చేస్తూ ఆ రీల్స్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తోంది. ఐతే ఈ మధ్య ఫైమా ఎక్కువగా టీవీ షోస్ లో అస్సలు కనిపించడం లేదు. ఒక్క ఎక్స్ట్రా జబర్దస్త్ లో తప్ప. ఎక్కువగా ఫారెన్ ట్రిప్స్ కి వెళ్తోంది. అలాగే రీల్స్ మాత్రమే ఎక్కువగా చేస్తూ కనిపిస్తోంది.