Read more!

English | Telugu

Eto Vellipoyindhi Manasu : అట్టహాసంగా ధన, సిరిల పెళ్ళి.. వారిద్దరిది జన్మజన్మల బంధమేనంట!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -70లో... సీతాకాంత్ రివర్స్ గేమ్ వర్క్ అవుట్ అవుతుంది. సిరి, ధనల పెళ్లికి మాణిక్యం ఒప్పుకుంటాడు. ఫస్ట్ కన్యధన పరిహార దోషం ముందు జరిపించండని పంతులికి సీతాకాంత్ చెప్తాడు. మరొకవైపు బావగారు ఏదో ప్లాన్ చెసారు అనుకున్నాం కదా.. మనం అనుకున్నది కరెక్ట్ సిరి, ధనలకి పెళ్లి చెయ్యాలని నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చారని శ్రీలతతో శ్రీవల్లి అంటుంది.

ఆ తర్వాత సిరి, ధన ఇద్దరు రెడీ అయి పెళ్లిపీటలపై కూర్చొని ఉంటారు. కాళ్ళు కడిగి కన్యాదానం చేసేవాళ్ళని రమ్మని పంతులు గారు చెప్తాడు. ఇప్పుడు తెలుస్తుంది వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారో లేదో అని శ్రీలత అనుకుంటుంది. సందీప్, శ్రీవల్లి దగ్గరికి సీతాకాంత్ వెళ్లి.. మీరు కన్యాదానం చెయ్యండి అని చెప్తాడు. అదేంటి మీరు ఉండగా వాళ్ళెందుకు? ఎవరైనా చూసి ఏమనుకుంటారు.. వాళ్ళు నిజంగా భార్యాభర్తలేనా అని అనుకుంటారు కదా అని శ్రీలత అంటుంది. నాకు అదే డౌట్ అని మాణిక్యం అంటాడు. మీరు నిజంగా పెళ్లి చేసుకున్నారా.. అసలు నిజం చెప్పండి అని సీతాకాంత్ ని శ్రీలత అడుగుతుంది. అదేంటి అలా అడుగుతున్నావని సీతాకాంత్ అంటాడు. నీ చెల్లి పెళ్లి కోసం ఎన్నో కష్టలు పడ్డావ్.. ఇప్పుడు కళ్యాణం జరిపించడం కోసం ఇంతలా ఇబ్బంది పడుతున్నారంటే మీరు పెళ్లి చేసుకోలేదు కదా అని శ్రీలత అడుగుతుంది. అప్పుడే స్వామి వస్తాడు. మీరు చెప్పండి స్వామి సీతాకాంత్ , రామలక్ష్మి ఇద్దరు పెళ్లి చేసుకున్నారా అని మాణిక్యం అడుగుతాడు. వాళ్ళు ఈ జన్మలోనే కదా గత జన్మలో కూడా భార్యభర్తలే అని స్వామి అనగానే అక్కడున్న వారితో పాటుగా సీతాకాంత్, రామలక్ష్మి ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు. మీరు వెళ్లి కాళ్ళు కడిగి కన్యదానం చేయండని సీతాకాంత్ , రామలక్ష్మిలకి చెప్పగానే.. వాళ్ళు వెళ్లి కన్యదానం చేస్తారు. అది చూసి శ్రీలత సందీప్ ఇద్దరు షాక్ అవుతారు.

ఆ తర్వాత సిరి, ధనల పెళ్లి జరుగుతుంది. మరొకవైపు అభి అక్కడికి రావడం చూసి.. ఇక్కడికి ఎందుకు వచ్చాడని సీతాకాంత్ అనుకుంటాడు. వాళ్ళు భార్యాభర్తలు కాదని అన్నారు.. ఇప్పుడు మైండ్ బ్లాంక్ అయ్యిందా అని శ్రీలతతో శ్రీవల్లి అనగానే.. ఆ రామలక్ష్మికి నరకం అంటే ఏంటో చూపిస్తానని శ్రీలత అంటుంది. మరొకవైపు రామలక్ష్మిని సీతాకాంత్ తీసుకొని.. అభి దగ్గరికి వెళ్తాడు. నిన్ను మాణిక్యం చూస్తే ఇంకేమైనా ఉందా అని సీతాకాంత్ అభిని పక్కకు తీసుకొని వెళ్తాడు. ఇక్కడ లేకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్లారని మాణిక్యం వాళ్ళను వెతుకుంటూ వస్తాడు. అభిని మాణిక్యం చూస్తాడో లేదో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే