Read more!

English | Telugu

Eto Vellipoyindhi Manasu: వారి శోభనానికి ముహుర్తం పెట్టించిన శ్రీలత!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -73  లో... జాబ్ లో జాయిన్ అవ్వమని మాణిక్యానికి సీతాకాంత్  విజిటింగ్ కార్డు ఇస్తాడు. రామలక్ష్మి, ధన ఇద్దరు కూడా జాబ్ చేయమని చెప్తారు. తాను వాళ్ళతో పాటు ఉండడానికి ఇష్టపడరు. మిమ్మల్ని ఇన్ని రోజులు నా గుప్పిట్లో పెంచాను కదా.. ఇప్పుడు ఇలా మారిపోయారేంటని మాణిక్యం ఆశ్చర్యపోతాడు.

ఆ తర్వాత శ్రీలత అందరిని లోపలికి పంపిస్తుంది. ఇప్పుడేం చూసావ్.. ఏదో పెద్ద ప్లాన్ చేసావ్ కదా.. ఇక ముందు నీ కూతురు, కొడుకులని కూడా ఈ ఇంట్లో నుండి పంపిస్తాను చూడని శ్రీలత అనగానే.... నా కూతురు కడుపులో ఈ ఇంటికి వారసుడు పుట్టాలి. అప్పుడు చక్రం తిప్పుతానని మాణిక్యం అంటాడు. ఆ తర్వాత అభి అమెరికా వెళ్ళాడు.. నిన్ను కూడా పంపిస్తాను.. ఆలోపు మనం జాగ్రత్తగా ఉండాలని రామలక్ష్మికి సీతాకాంత్ చెప్తాడు. ఆ తర్వాత సీతాకాంత్ వెళ్తుంటే.. కార్ కి అడ్డుగా అభి వస్తాడు. వెనకాల మాణిక్యం వస్తున్నాడని అభిని సీతాకాంత్ పక్కకి తీసుకొని వెళ్లి మాట్లాడతాడు. అమెరికా వెళ్ళలేదా అని సీతాకాంత్ అడుగుతాడు. మా అమ్మకి బాలేదు డబ్బులు అవసరం ఉన్నాయనగానే సీతకాంత్ ఇస్తానని చెప్తాడు.. ఆ తర్వాత అభి వెళ్ళిపోతాడు. అదంతా పై నుండి శ్రీలత చూసి సందీప్ ని పిలిచి.. మొన్న సీతాకాంత్ రహస్యంగా మాట్లాడాడు కదా ఇప్పుడు అలాగే పక్కకి తీసుకొని వెళ్లి మాట్లాడుతున్నాడు. ఏదో ఉంది నువ్వు వాడెవడో కనుక్కో అని సందీప్ ని శ్రీలత పంపిస్తుంది. ఆ తర్వాత అభి వెనకాలే సందీప్ వెళ్తాడు. కొంతదూరం వెళ్లాక సందీప్ ని అభి గుర్తుపట్టి త్వరగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత రామలక్ష్మి బట్టలు సర్దుతుంటే.. అప్పుడే సిరి వచ్చి మాట్లాడుతుంది. మీరు కేవలం మాకోసం మాత్రమే పెళ్లి చేసుకున్నారు కానీ నువ్వు మా అన్నయ్య జీవితంలోకి రావడం.. మా అన్నయ్య లైఫ్ చేంజ్ అయిందంటూ సిరి మాట్లాడుతుంది. అప్పుడే శ్రీవల్లి వచ్చి.. అత్తయ్య రామంటుందని చెప్తుంది. సిరి, రామలక్ష్మి ఇద్దరు హాల్లోకి వెళ్తారు. అక్కడ పంతులు గారితో రామలక్ష్మి, సీతాకాంత్ ల శోభనానికి ముహూర్తం పెట్టిస్తుంది శ్రీలత. అది చూసి రామలక్ష్మి షాక్ అవుతుంది. ఆల్రెడీ మా ఇంటి దగ్గర ఈ తంతు అయిపోయిందని రామలక్ష్మి చెప్పినా వినకుండా కావాలనే.. శ్రీలత శోభనం జరిపించాలనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.