Read more!

English | Telugu

ప్రియుడి దగ్గరకు పంపించమని భర్తను కోరిన భార్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్ళిపోయింది మనసు'(Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -71 లో... ఆ మాణిక్యం నీడనే పడొద్దు అనుకుంటే.. వాడి కొడుకు నాకు అల్లుడయ్యాడు. వాడి కూతురు నాకు కోడలు అయిందని సందీప్, శ్రీవల్లిలతో చెప్తూ శ్రీలత ఫ్రస్ట్రేట్ అవుతుంటుంది. అప్పుడే అభి, రామలక్ష్మి ఇద్దరు మాట్లాడుకోవడం, దూరంగా సీతాకాంత్ నిలబడి ఉండడం అంతా.. కొంతదూరం నుండి శ్రీలత చూసి వాడెవడని అంటుంది.

మరొకవైపు మాణిక్యం అటువైపు వస్తుంటే సీతాకాంత్ గమనించి వెంటనే అభిని అక్కడ నుండి పంపిస్తాడు. వాళ్ళని మాణిక్యం చూస్తాడు. ఏదో గూడుపుఠాని నడిపిస్తున్నారనుకునుకొని భయపడ్డాను.. ఇక్కడ ఏం చేస్తున్నారని సీతాకాంత్ ని మాణిక్యం అడుగుతాడు. అక్కడ పూజ జరుగుతుందని చెప్పి రమ్మని చెప్తాడు. అదంతా దూరం నుండి శ్రీలత చూస్తుంది. మాణిక్యాన్ని చూడగానే.. ఎందుకు సీత అతన్ని పంపించాడో తెలుసుకోవాలి. సందీప్ నువు వెళ్లి వాడెవడో కనుక్కోమని సందీప్ ని శ్రీలత పంపిస్తుంది. సందీప్ వెళ్లేసరికి అభి వెళ్ళిపోతాడు. మరొకవైపు పూజ పూర్తవుతుంది. ఇద్దరు కలకాలం సంతోషంగా ఉంటారని స్వామి చెప్తాడు. " మీరు ఏది అంటే అది జరుగుతుంది. నా కొడుకు సీతాకాంత్, కోడలు రామలక్ష్మికి పండంటి బిడ్డ పుట్టాలని ఆశీర్వాదించండి" అని స్వామిని శ్రీలత అడుగుతుంది. దాంతో సీతాకాంత్, రామలక్ష్మి ఇద్దరు స్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. సుపుత్ర ప్రాప్తిరస్తు అని స్వామి దీవిస్తాడు. దాంతో రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరు షాక్ అవుతారు.

కాసేపటికి శ్రీలత, సందీప్ మాట్లాడుకుంటారు. వాడెవడో దొరికాడా? వాడెవడో మనం కచ్చితంగా తెలుసుకోవాలని సందీప్ తో శ్రీలత అంటుంది.  అ తర్వాత మాణిక్యానికి సీతాకాంత్ ప్లాన్ చేసి పెళ్లి నాటకం ఆడాడని తెలుస్తుంది. దాంతో నాకు ఇంత పెద్ద షాక్ ఇస్తావా.. చెప్తానని మాణిక్యం అంటాడు. ఆ తర్వాత సీతాకంత్ స్వామి దగ్గరికి వచ్చి మా గురించి మీకు తెలుసు కదా అని అడుగుతాడు. అవునని స్వామిజీ చెప్తాడు. ఇది నిజమేనా అని సీతాకాంత్ అడుగగానే.. వాళ్ళు గత జన్మలో భార్యాభర్తలన్న విషయం చెప్పి గతం తాలుకూ జ్ఞాపకాలు చూపిస్తాడు. అవి చూసి సీతాకాంత్ ఆశ్చర్యపోతాడు. మరుసటిరోజు ఉదయం సీతాకంత్ నిద్రలేస్తాడు. నా మనసు అంత డిస్టబెన్స్ గా ఉంది. మీరు నన్ను అభి దగ్గరికి త్వరలోనే పంపించండి అని రామలక్ష్మి చెప్పగా.. సరేనని సీతాకంత్ అంటాడు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.