Read more!

English | Telugu

Eto Vellipoindhi Manasu : చస్తానని మాణిక్యం బ్రతిమాలడంతో‌ వాళ్ళిద్దరి పెళ్ళికి ఒప్పుకున్న సీతాకాంత్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు '. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్- 69లో.. సీతాకాంత్ ఒకతడిని తీసుకొచ్చి నా చెల్లెలు సిరీతో పెళ్ళి చేస్తున్నానని అంటాడు. రామలక్ష్మి నాకు అక్కర్లేదు.. నీ కూతురు ఇంకా నా జీవితంలో ఎందుకుండాలి. అందుకే ఇదిగో తీసుకెళ్ళు అని రామలక్ష్మిని మాణిక్యం వైపు తోసేస్తాడు.‌ దాంతో ఆయన చేసిన తప్పుకి నా కూతురికి శిక్ష వేస్తున్నారేంటని రామలక్ష్మి వాళ్ళ అమ్మ సుజాత అడుగగా.. ఎదుటివాళ్ళ పరిస్థితిని అడ్వాండేజ్ గా తీసుకొని ఆడుకోవాలని చూస్తే ఆ బాధ ఎలా ఉంటుందో  మీ ఆయనకు తెలిసి రావాలని సీతాకాంత్ అంటాడు. 

ఆ తర్వాత సిరికి వేరొకతడికి పెళ్ళి చేయడానికి ఏర్పాట్లు చేస్తాడు సీతాకాంత్.  ఇక మాణిక్యం, సుజాత, రామలక్ష్మి, ధన భాదపడుతుంటారు. సిరి లేకుండా నేనుండలేనంటూ కోనేరులో దూకి చావాలనుకుంటాడు ధన. తను చనిపోవాలనుకుంటే సుజాత, రామలక్ష్మి ఎంత ఆపినా వినడు. దాంతో మాణిక్యం ఆపి.. సిరీతో నీ పెళ్ళి జరిపించే బాధ్యత నాది అని మాణిక్యం చెప్పగానే ధన ఆగిపోతాడు. ఆ తర్వాత మాణిక్యం ఫ్యామిలీ పెళ్ళి జరిగే చోటుకి వెళ్తారు. ఆపండి అని మాణిక్యం అనగానే.. ఎందుకు ఆపాలని సీతాకాంత్ అడుగుతాడు. సిరీతో ధన పెళ్లి జరిపించడానికి నేను ఒప్పుకుంటున్నానని మాణిక్యం అనగానే.. నేను ఒప్పుకోనని సీతాకాంత్ అంటాడు. లేదు అల్లుడు నాకు బుద్ది వచ్చింది నేను మారిపోయాను వారి పెళ్ళికి ఒప్పుకుంటున్నాని అనగానే.. నీలాంటి వాడిని అసలు నమ్మలేనని సీతాకాంత్ అంటాడు. నీ కాళ్ళు మొక్కుతున్న అల్లుడు అని సీతాకాంత్ కాళ్ళ మీద పడతాడు మాణిక్యం. 

ప్లీజ్ అల్లుడు సిరి, ధనల పెళ్ళి జరిపించని అనగానే.. నువ్వు కాళ్ళ మీద పడ్డా నేను ఒప్పుకోను. వెళ్లిపోమని సీతాకాంత్ అంటాడు. బాబు మీ నిర్ణయం మీదే అటు నా కూతురి జీవితం, ఇటు నా కొడుకు ప్రాణాలు ఆధారపడి ఉన్నాయని సుజాత అంటుంది. అతడికి అన్ని చెప్పి ఒప్పించాను నేనేం చేయలేనని సీతాకాంత్ అనగానే.. సుజాత, మాణిక్యం వెళ్ళి ఆ పెళ్ళికొడుకిని బ్రతిమిలాడుతారు. ఇక అతను ఒప్పుకున్నాక సీతాకాంత్ ఒప్పుకోడు. ఇంకా నువ్వు చెప్పినట్టే వింటాను అల్లుడు.. నువ్వు ఒప్పుకోకపోతే వాళ్ళ కన్నా ముందు నేనే చస్తానని మాణిక్యం అనగానే.. సీతాకాంత్ కాసేపు ఆలోచించి ఒప్పుకుంటాడు. ఆ తర్వాతి శ్రీలత అడ్డుచెప్తుంది. వాళ్ళనెందుకు బలవంతంగా ఇంటికి తీసుకురావలనుకుంటున్నావని శ్రీలత అడ్డు చెప్పగా.. మొదట ఒప్పుకున్నావ్ కదా ఇప్పుడేం అడ్డుచెప్పకని శ్రీలతతో సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత ధనని పెళ్ళికొడుకుని చేయడానికి సీతాకాంత్ వాళ్ళ తాతయ్య సీతాకాంత్ కలిసి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.