Read more!

English | Telugu

దీప్తి సునైన పుస్తకం పేరేంటో తెలుసా?

ఇన్ స్టాగ్రామ్ లో సెలబ్రిటీలు చేసే కొన్ని పోస్ట్ లు వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు పోస్ట్ ల కంటే ఆ పోస్ట్ గురించి వాళ్ళు రాసిన మాటలు వైరల్ అవుతుంటాయి. అలాంటిదే ఇప్పుడు తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అయింది. దీప్తి సునైన చేసిన పోస్ట్ కి ఒక క్వశ్చన్ ని అడుగగా.. ఇప్పుడు దానికి రకరకాల సమాధానాలు వస్తున్నాయి. దీప్తి సునైన.. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఫేమ్ లోకి వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. దీప్తి సునైన షణ్ముఖ్ జస్వంత్ కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసి సన్నిహితంగా మారి లవ్ లో పడిపోయారు. ఎటు చూసిన సోషల్ మీడియాలో షణ్ముఖ్, దీప్తి సునైనల జంటనే కన్పిస్తుంది. 

షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు తనకి దీప్తి సపోర్ట్ బాగా ఉండేది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక షన్ను, దీప్తి సునైనా ఇద్దరు విడిపోయారు. వాళ్ళు విడిపోవడానికి కారణం బిగ్ బాస్ హౌస్‌లో షణ్ముఖ్ ఉన్నప్పుడు.. సిరితో క్లోజ్ గా ఉండడం వల్లనే.. వాళ్ళిద్దరికి బ్రేకప్ అయ్యిందని అప్పట్లో ఆ న్యూస్ వైరల్ గా మారిన విషయం అందరికి తెలిసిందే. షణ్ముఖ్, దీప్తి సునైన ఇద్దరు విడిపోయి.. ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. అయితే రెండు మూడు సందర్బాలలో ఈవెంట్స్ లో ఎదురుపడినా పరిచయం లేనట్లుగా ఉన్నారు. కాగా ఇద్దరు ఒకరి గురించి మరొకరు ఇండైరెక్ట్ గా తమ ఇన్ స్టాగ్రామ్ పేజీలలో మాట్లాడుకుంటున్నారు. అంటే సెటైరికల్ గా ఒకరి పోస్ట్ కి మరొకరు కౌంటర్లు వేస్తూ పోస్ట్ లు చేస్తున్నారు. దీప్తి సునైన లవ్ బ్రేకప్ అయినప్పటి నుండి తన పరిధిలో తాను ఎంజాయ్ చేస్తూ లైఫ్ ని గడుపుతుంది

దీప్తి సునైన.. ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలని షేర్ చేసింది. 'నీ జీవితం ఒక పుస్తకమైతే.. దానికి టైటిల్ ఏమని రాస్తావ్' అని అడిగింది దీప్తి సునైన. దీంతో ఫాలోవర్స్ కామెంట్లతో తమ అభిప్రాయాలను  తెలుపుతున్నారు. ఒకరేమో 'నా చావు నేను చస్తా నీకెందుకు' అని కామెంట్ చేయగా, మరొకరు 'ముందు నువ్వు టెన్త్ పాస్ అవ్వు' అని కామెంట్ చేసారు. ఇంకా కొందరు జీవితం ఒక ప్రయాణం ఇలాంటి పాజిటివ్ కామెంట్లు కూడా చేస్తున్నారు. కాగా దీప్తి సునైన అడిగిన ఈ ప్రశ్నకి ఇన్ స్టాగ్రామ్ లోని కొంతమంది సెలబ్రిటీలు కూడా కామెంట్లు చేస్తున్నారు. కాగా దీప్తి సునైన అడిగిన ఈ ప్రశ్న ఇప్పుడు వైరల్ గా మారింది.