English | Telugu

అక్కడ... దీప్తీ సునైనా టాటూ!

ఈతరం యువతీయువకులు టాటూలు వేయించుకోవడం కామన్. అఫ్‌కోర్స్, ఈమధ్య పెద్దవాళ్ళు కూడా టాటూలు వేయించుకున్నారు అనుకోండి. మొన్నటికి మొన్న 'కామెడీ స్టార్స్' షోలో అషురెడ్డి పేరును గుండెలపై టాటూగా వేయించుకున్నాడు హరి. అషురెడ్డి మదర్ కూడా చేయిపై కుమార్తె పేరు పచ్చబొట్టుగా పడింది. ఇవి రీసెంట్ మెమరీస్.

లిస్టు తీస్తే టాటూలు వేయించుకున్న టీవీ సెలబ్రిటీలు బోలెడుమంది కనిపిస్తారు. అందులో డబ్ స్మాష్ లతో ఫేమస్ అయిన అమ్మాయి, 'బిగ్ బాస్' ఫేమ్ దీప్తీ సునైనా కూడా ఉంది. ఆల్రెడీ ఆమె ఒంటిపై చాలా టాటూలు ఉన్నాయి. షణ్ముఖ్ జస్వంత్ చేతిపై, ఆమె చేతిపై ఒకే విధమైన టాటూలు కనిపిస్తాయి. లేటెస్టుగా మరో టాటూను వేయించుకుంది.

దీప్తి సునైనా తన ఎడమ చేతి భుజం మీద టాటూ వేయించుకుంది. తనను తాను కౌగిలించుకుని ఉన్నట్టు కనిపించే అమ్మాయి రూపం స్కెచ్ టాటూగా వేయించుకుంది. దీనర్థం ఏమిటో? దీప్తి సునైనాకు అందరికి కంటే తనంటేనే ఎక్కువ‌ ఇష్టమనా? అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.