English | Telugu

Brahmamudi: ఆస్తిని వాటాలు చేయమన్న ఇంటి కోడలు.. ఇంటిపెద్ద కండిషన్ అదే!

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -564 లో....జీవితంలో ఈ అప్పుని నా కోడలుగా ఒప్పుకోనని ధాన్యలక్ష్మి అనగానే.. నా జీవితంలో కూడా ఇంట్లో అడుగు పెట్టనని కళ్యాణ్ అంటాడు. ఇలా నన్ను పిలిచి అవమానించడం రెండవసారి అని కళ్యాణ్ అంటాడు. నాకేంటి రా దాన్ని వదిలి వచ్చేయ్ అని ధాన్యలక్ష్మి అనగానే.. అనామికలాగా నన్ను వదిలియమంటున్నారా.. పచ్చడి మెతుకలు తిన్నా సరే కానీ నాకు ఈ కోట్ల ఆస్తులు వద్దు. ఇంకోసారి పిలిస్తే కళ్యాణ్ వస్తానన్న కూడా నేను కళ్యాణ్ ని రానివ్వనని కళ్యాణ్ ని తీసుకొని వెళ్తుంది అప్పు.

ఆ తర్వాత  ఎందుకు ఇలా చేస్తున్నావంటూ ధాన్యలక్ష్మిని ప్రకాష్ తిడతాడు. అసలేం కావాలని ఇదంతా చేస్తున్నావని అడుగగా.. నా కొడుకుకి న్యాయం కావాలి. అందుకే మీరు ఆస్తులు పంచాలని ధాన్యలక్ష్మి అంటుంది. ఇది ఉమ్మడి కుటుంబం అలా ఎప్పుడు జరగదని ఇందిరాదేవి చెప్తుంది. ఆ తర్వాత రుద్రాణి మధ్యలో కలుగజేసుకొని ఎవరి వాటా వాళ్లకి ఇవ్వండి అని అనగానే.. నీ ప్లాన్ ఇదా అయిన నీకు వాటా ఎక్కడిదంటూ ఇందిరాదేవి తిడుతుంది. నన్ను పెంచుకున్నారు కదా వాటా వేస్తే మాకు వాటా వస్తుందని రుద్రాణి అంటుంది. ఎందుకు అత్తయ్య మీరు ఇలా అంటున్నారని కావ్య అనగానే.. నువ్వెవరు నాకు చెప్పడానికి భర్తని ఇల్లుని వద్దనుకొని వెళ్ళావని ధాన్యలక్ష్మి అంటుంది. నాకు కొంచెం టైమ్ ఇవ్వు ధాన్యలక్ష్మి అని సీతారామయ్య అంటాడు. ఆ తర్వాత ప్లాన్ సక్సెస్ అయిందంటూ అనామిక, సామంత్ లు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు.

ఆ తర్వాత అప్పు, కళ్యాణ్ జరిగింది గుర్తుచేసుకుంటారు. వాళ్ళు నన్ను అర్ధం చేసుకోకుండా మాట్లాడారు.. నువ్వు అలా మాట్లాడితే నేను ఇంకా ఎక్కువ బాధపడతానని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత కావ్య జరిగిన దానికి బాధపడుతుంటే.. నువ్వెందుకు భాదపడుతున్నావని కనకం అంటుంది. అంటే అది నా కుటుంబమని కావ్య ఎమోషనల్ గా మాట్లాడుతుంది. ఎలాగైనా అలా కుటుంబం విడిపోకుండా చూడాలని కావ్య అనుకుంటుంది. ఆ తర్వాత ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది రుద్రాణి. తరువాయి భాగంలో ఒక ప్రాజెక్ట్ వచ్చింది. అది మీ ఇద్దరిలో ఎవరు పర్ఫెక్ట్ చేస్తే ఇక వాళ్లే సీఈఓ అని రాజ్, కావ్యలకి సీతారామయ్య చెప్తాడు. ఒకవేళ రాజ్ చెయ్యకపోతే కావ్యని భార్యగా ఒప్పుకొని ఇంటికి తీసుకొని రావాలని సీతారామయ్య అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.