English | Telugu

Brahmamudi : ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టిన రుద్రాణి.. నిలదీసి‌న కావ్య!

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -472 లో.. ధాన్యలక్ష్మి సాంగ్స్ వింటుంటే.. అప్పుడే తన దగ్గరకి రుద్రాణి వస్తుంది. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. కళ్యాణ్ గురించి అన్నీ చెప్పాను కళ్యాణ్ ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని చెప్పిందని రుద్రాణి అనగానే.. ఇప్పుడు కళ్యాణ్ కి పెళ్లి ఏంటి విడాకులు అయి రెండు రోజులే అయింది. ఇంకా వాడు సెట్ అవ్వలేదని ధాన్యలక్ష్మి అంటుంది. నువ్వు ఇలాగే చూస్తూ ఉండు.. కరెక్ట్ టైమ్ అనుకొని కళ్యాణ్ కి మాయమాటలు చెప్పి అప్పుని ఇచ్చి పెళ్లి చేస్తోందని రుద్రాణి అంటుంది.

అలా చేస్తూ ఉంటే నేను చూస్తానా అని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ కావ్య గురించి నీకు తెలియదా అపర్ణని ఎలా ఉండేదాన్ని.. ఎలా మార్చింది రాజ్ ని ఎలా మార్చిందని ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది రుద్రాణి. మరొకవైపు పెళ్లి ఫిక్స్ అయినందుకు కనకం కుటుంబం హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు ఎందుకో బాధగా ఉంది.. మీ దగ్గర డబ్బులు లేవు.. వాళ్ళున్న వాళ్ళు కాదని స్వప్న అనగానే.. ఇప్పుడు నాకు అలాంటి ఆలోచనలు లేవు. మీరు డబ్బున్న ఇంటికి ఇస్తే మీరు కష్టం అనుభవించారు. ఇప్పుడు కావ్య జీవితం కుదుటపడిందని కనకం అంటుంది. అయినా వాళ్లకు ఏదైనా అవసరమొస్తే మనం ఉన్నాం కదా అని కావ్య అంటుంది. ఆ తర్వాత అప్పు అక్కడ నుండి బయటకు వస్తుంది. తన వెనకాలే కావ్య, స్వప్నలు వస్తారు. ఏంటి అలా వున్నావ్ పెళ్లి ఇష్టం లేదా అని కావ్య అడుగుతుంది. నా వల్ల అమ్మనాన్న ఇద్దరు చాలా బాధపడ్డారు.. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా.. అని అప్పు అంటుంది. ఆ తర్వాత అక్కచెల్లెల్లు సరదాగా మాట్లాడుకుంటారు. కాసేపటికి అప్పుకి కళ్యాణ్ ఫోన్ చేసి.. ఒకసారి మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తాడు. అప్పు మొదట వద్దన్న ఆ తర్వాత సరేనంటుంది.

ఆ తర్వాత ధాన్యలక్ష్మి ఇంట్లో అందరిని పిలిచి.. కళ్యాణ్ కి పెళ్లి చెయ్యాలనుకుంటున్నానని అనగానే అందరు షాక్ అవుతారు. నాకు చెప్పకుండా నువ్వు నిర్ణయం తీసుకున్నావంటూ ప్రకాష్ తనపై కోప్పడతాడు. అప్పుడే కావ్య, స్వప్నలు వస్తారు. ఇప్పుడే కళ్యాణ్ కి పెళ్లి ఏంటని కావ్య అనగానే.. మరి ఎప్పుడు చెయ్యాలి. నువ్వు ఏదైనా ప్లాన్ చేసావా అని ధాన్యలక్ష్మి అనగానే.. నేనేందుకు చేస్తానని కావ్య అంటుంది. అప్పుని కళ్యాణ్ కి ఇచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటున్నావా అని ధాన్యలక్ష్మి అనగానే.. తనపై కావ్య కోప్పడుతుంది. ఏంటి అక్క నీ కోడలు అలా మాట్లాడుతుందని అపర్ణకి ధాన్యలక్ష్మి చెప్తుంది. నేనే మాట్లాడమని చెప్పానని అపర్ణ అంటుంది. తరువాయి భాగంలో నువ్వెందుకు కళ్యాణ్ ని పెళ్లి కి ఒప్పిస్తానని మాటిచ్చావని కావ్య పైన రాజ్ కోప్పడతాడు. కళ్యాణ్ మనసులో అప్పు ఉందని రాజ్ చెప్తాడు. ఆ తర్వాత కావ్య వెళ్లి కళ్యాణ్ ని మీరు అప్పుని ప్రేమిస్తున్నారా అని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.