Read more!

English | Telugu

Brahmamudi : పెళ్ళిరోజున భార్యకి ప్రేమతో బొకే తీసుకొచ్చిన భర్త!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -396 లో.. ప్రకాష్, ధాన్యలక్ష్మి మాట్లాడుకుంటారు. నీవల్లే ఇదంతా ప్రతి దానికి ఇలా వెనకేసుకువచ్చావ్ కదా అని ధాన్యలక్ష్మిని ప్రకాష్ తిడతాడు. నా కోడలు నా కోడలు అంటూ నెత్తిన పెట్టుకున్నావ్.. ఇప్పుడు చూడు కళ్యాణ్ కి ఎలాంటి సిచువేషన్ కి తీసుకొని వచ్చిందో చూసావా అంటు ధాన్యలక్ష్మితో అపర్ణ అంటుంది. ఇప్పుడు అందరు మాట్లాడుతున్నారు.. కళ్యాణ్ తో అప్పు తిరుగుతుంటే ఎవరు మాట్లాడలేదంటూ అనామిక అనగానే. అప్పు గురించి ఒక్క మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు చెప్తున్నానని అనామికకి స్వప్న వార్నింగ్ ఇస్తుంది.

ఆ తర్వాత ఎవరి కోసమో నువ్వు నా కొడుకుకి ఇలా చేస్తావా? నీకేం తక్కువ చేసానంటూ అనామికని ధాన్యలక్ష్మి అడుగుతుంది. ఇంత దారుణంగా అవమానిస్తావా అంటూ ధాన్యలక్ష్మి అంటుంటే.. ఎక్కవ మాట్లాడితే నీపై కూడా కేసు పెడుతుందంటూ ధాన్యలక్ష్మిని రుద్రాణి పక్కకి తీసుకొని వెళ్లి.. అనామిక చేసింది కరెక్టే ఎందుకంటే అసలు అప్పు తో తిరోగొద్దని ఎంత చెప్పిన ఎవరికి చెప్పినా.. విన్నారా.. ఇప్పుడు అప్పు పరువుపోతుంది. దాంతో ఆ తర్వాత అప్పు, కళ్యాణ్ ఇద్దరు ఇక ముందు కలుసుకోరని రుద్రాణి చెప్పగానే.. ధాన్యలక్ష్మికి కూడా కరెక్ట్ అనిపిస్తుంది. మరొకవైపు నా వల్లే నువ్వు స్టేషన్ కి రావల్సి వచ్చిందంటూ అప్పుకి కళ్యాణ్ సారీ చెప్తాడు. అప్పుడే రాజ్ , కావ్య ఇద్దరు స్టేషన్ కి వెళ్లి ఎస్సై తో మాట్లాడతారు. వాళ్ళు మంచి ఫ్రెండ్స్ సర్ అనామిక ఆవేశంలో అలా చేసిందని రాజ్ అంటాడు. ఈ విషయం చాలా సీరియస్ సర్ గృహహింస కేసు. ఇంకా ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చెయ్యలేదు.. ఈ లోపు అనామికతో కేసు విత్ డ్రా చేయించండని ఎస్సై చెప్తాడు. ఆ తర్వాత ఎవరు చెప్తే వింటుందో  నాకు తెలుసని కావ్య అంటుంది. రాజ్, కావ్య ఇద్దరు ఇద్దరు వెళ్తారు.

మరొకవైపు కనకం ఆవేశంగా దుగ్గిరాల ఇంటికి వచ్చి అందరిపైన కోప్పడుతుంది. కళ్యాణ్ బాబు చుట్టూ తిరిగి ఎరవేసి పెళ్లి చేసుకున్నావ్ అని కనకం అనగానే.. నీ కూతుళ్లు అలా వచ్చారంటూ అనామిక అనగానే... స్వప్న అనామికపైన కోప్పడుతుంది. ఒకవేళ అదే గనుక కళ్యాణ్ ని చేసుకోవాలనుకుంటే నిన్ను కళ్యాణ్ ని కలపడానికి ఎందుకు కష్టపడుతుందని కనకం అనామిక పై విరుచుకుపడుతుంది. ఆ తర్వాత అసలే పెళ్లి కావల్సిన నా కూతురు పైన ఇలాంటివి చేస్తే తన పరిస్థితి ఏంటని కనకం అడుగుతుంది. తరువాయి భాగంలో రాజ్, కావ్య పెళ్లి రోజున.. కావ్య కోసం రాజ్ పూల బొకే తీసుకుంటాడు. అది వాడిపోయి కావ్యకి కన్పిస్తుంది. అది చూసిన కావ్య.. నా కోసం తీసుకొని వచ్చారు కదా.. ఇది ఇవ్వకుండా ఎందుకు బాబుని తీసుకొని వచ్చారు. ఈ మధ్య ఏం జరిగిందని కావ్య అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.