Read more!

English | Telugu

Brahmamudi : భర్తపై గృహహింస కేసు పెట్టిన భార్య.. యావజ్జీవ కారాగార శిక్షే బెటర్ అంట!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -395 లో...ఆ అప్పు పరువు తీసిందని, కళ్యాణ్ నీకు దక్కాలంటే ఈ పని చేయమంటూ అనామికకి రుద్రాణి ఏదో ప్లాన్  చెప్తుంది. దీని వల్ల కళ్యాణ్ ఇబ్బంది పడతాడేమోనని అనామిక అనగానే.. అప్పు నీ భర్త జోలికి రాకుండా ఉండాలంటే ఇదే కరెక్ట్ అని రుద్రాణి అంటుంది ఇక ఇందులో అందరూ కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన వినొద్దని రుద్రాణి చెప్తుంది. ఆ తర్వాత ఆ కావ్య ఇప్పుడు తన చెల్లిని ఎలా కాపాడుతుందో చూద్దామని రుద్రాణి అనుకుంటుంది.

ఆ తర్వాత అనామిక ఇంట్లో ఎక్కడ కన్పించడం లేదని ఇంట్లో అందరితో ధాన్యలక్ష్మి చెప్తుంది. ఏమైంది ఏదైనా గొడవ జరిగిందా అని కళ్యాణ్ ని ధాన్యలక్ష్మి అడుగుతుంది.. అసలు ఎప్పుడైనా నా భార్యలాగా నడుచుకుందా అంటూ కళ్యాణ్ సీరియస్ అవుతాడు. ఏదైనా గొడవ జరిగిందేమో అందుకే ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయిందని రుద్రాణి అంటుంది. మరొకవైపు అప్పు భోజనం చేస్తుంటే.. అప్పుడే పోలీసులు ఇంటికి వస్తారు. అప్పు పైన అనామిక కంప్లైంట్ ఇచ్చింది.. తన భర్త ఈమెతో తిరిగి టార్చర్ చేస్తున్నాడని గృహహింస చట్టం కింద కేసు పెట్టిందంటూ అప్పుని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత ఏమైందని ఇంట్లో వాళ్ళు కళ్యాణ్ ని అడుగగా.. అనామిక చెంప చెల్లుమనిపించానని కళ్యాణ్ చెప్తాడు.. అపుడే పోలీసులతో అనామిక వస్తుంది. కొట్టానని ఎంత ధైర్యం గా చెప్తున్నాడో చూడండి అని అనామిక అంటుంది.. ఆ అప్పుతో తిరుగుతూ నన్ను హింసిస్తున్నాడని.. నా భర్తని అరెస్ట్ చెయ్యండి అని అనామిక అనగానే.. అందరు షాక్ అవుతారు. అనామిక కి అందరు నచ్చజెప్పాలని చూసిన తను వినదు. ఇది ఫ్యామిలీలో తేల్చుకునేది మీరు వెళ్ళండి అని పోలీసులతో రాజ్ అంటాడు. మీరు పట్టించుకోకుంటే నేను మీ పై ఆఫీసర్ ని కలుస్తానని పోలీసులతో అనామిక అంటుంది.

నువ్వు కేసు విత్ డ్రా చేసుకోవడానికి ఏం చేయమంటావని ధాన్యలక్ష్మి అడుగుతుంది.‌ అప్పుతో ఇక తిరగనని చెప్పి నాకూ సారీ చెప్పాలని అనామిక అంటుంది.. నీతో కాపురం చెయ్యడం కంటే యావజ్జీవ కారాగారా శిక్ష వేసుకోవడం బెటర్ అంటూ కళ్యాణ్ పోలీసులతో వెళ్లిపోతాడు. ఆ తర్వాత నీ వల్లే ఇదంతా అంటూ ధాన్యలక్ష్మిని ప్రకాష్ తిడుతాడు... తరువాయి భాగంలో ఈ కేసు చాలా స్ట్రాంగ్ గా ఉంది. కళ్యాణ్ ని వదిలి పెట్టడం కుదరదని పోలీసులు చెప్తారు. మరొకవైపు నా కూతురికి న్యాయం జరిగే వరకు ఇక్కడ నుండి కదలనని కనకం నట్టింట్లో కూర్చొని ఉంటుంది. ఆ తర్వాత కావ్య, రాజ్ ఇద్దరు అనామిక వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్లి.. నీ కూతురిని కేసు విత్ డ్రా చేసుకొమ్మనండి లేదంటే ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్తామని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.