Read more!

English | Telugu

జ్యూస్ లో మత్తుమందు కలిపిన అత్త!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -383 లో...ఆస్తి కోసమే ఇంట్లో ఉంటుందని కావ్యని రుద్రాణి, ధాన్యలక్ష్మి ఇద్దరు అంటుంటే రాజ్ వాళ్ళపై కోప్పడతాడు. కావ్య ఎందుకు ఇక్కడ ఉంటుందో నా మనసుకి తెలుసు.. ఆస్తులు కావాలనుకుంటే తాతయ్యని అడిగితే ఈ ఇల్లు రాసిస్తాడు. అప్పుడు నువ్వు కూడా నాలాగే అతిథిలాగే ఉండాల్సి వస్తుందని రుద్రాణితో రాజ్ చెప్పేసి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత ఇదంతా నీవల్లే వానికి ఎవరు సపోర్ట్ చెయ్యకండి అంటే వినకుండా సపోర్ట్ చేసావ్.. వాడు నిజం చెప్పట్లేదని కావ్యపై అపర్ణ కోప్పడుతుంది. నిజం మనకు త్వరలోనే తెలుస్తుందని కావ్య అందరికి చెప్తుంది. మరొకవైపు ఏదో లెటర్ వచ్చిందంటూ కృష్ణమూర్తి తీసుకొని వచ్చి అప్పుకి ఇస్తాడు. అది ఓపెన్ చెయ్యడంతో అందులో అప్పు పోలీస్ కి సెలెక్ట్ కాలేదన్న విషయం ఉంటుంది. దాంతో అప్పు బాధపడుతుంది. నా కూతుళ్ళగా పుట్టడం వల్లే వాళ్లకి ఇన్ని ఇబ్బందులని కనకం ఎమోషనల్ అవుతుంది. అ తర్వాత రాజ్ ఎలాగైనా కావ్య ని కూడా రీయూనియన్ పార్టీ కీ తీసుకొని వెళదామని అనుకుని రమ్మని అడుగడానికి ఇబ్బంది పడతాడు. అప్పుడే శ్వేత కాల్ చేసి.. రీయూనియన్ పార్టీకి రమ్మంటుంది. ఆ తర్వాత రాజ్ కూడా.. అందరు వాళ్ల భార్యలతో వస్తున్నారు.. నువ్వు కూడా రావాలని కావ్యతో అనగానే.. నేను ఏ హోదాలో రావాలంటూ రాజ్ ని కాసేపు ఓ ఆట ఆడుకుంటుంది. ఆ తర్వాత రాజ్ రిక్వెస్ట్ చెయ్యడంతో కావ్య వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. మరొకవైపు అప్పు, కళ్యాణ్ లు ఇద్దరు ఒక దగ్గర కలుసుకొని మాట్లాడుకుంటారు. అప్పు సెలక్ట్ కాలేదని ఫీల్ అవుతుంటే కళ్యాణ్ ధైర్యం చెప్తాడు.

మరొకవైపు రుద్రాణి జ్యూస్ లో ఏదో కలుపుతుంది... ఇది తాగి మత్తుగా పడుకుంటే ఆస్తి పేపర్స్ పై సంతకం పెట్టించుకుంటాను‌‌.. నిన్ను ఇరికిస్తానని రుద్రాణి అనుకొని.. స్వప్నకి జ్యూస్ తీసుకొని వెళ్తుంది. అప్పటికే స్వప్న కడుపు నొప్పితో బాధపడుతుంది. నాకేం అవసరం లేదంటూ రుద్రాణిని స్వప్న వెనక్కి పంపుతుంది. ఎన్నడూ లేనిది ఇలా జ్యూస్ తీసుకొని వస్తుంది. దీంతో జాగ్రత్తగా ఉండాలని స్వప్న అనుకుంటుంది. అ తర్వాత కావ్య దేవుడికి తన బాధని చెప్పుకుంటుంది. అది ఇందిరాదేవి వింటుంది. తరువాయి భాగంలో.. రీయూనియన్ పార్టీకి శ్వేత వస్తుంది. వెన్నెల వస్తుందా అని శ్వేతని కావ్య అడుగగా.. వస్తుందని శ్వేత చెప్తుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.