Read more!

English | Telugu

Brahmamudi :  ఇంట్లో నుండి వెళ్ళిపోమన్న అత్త.. గడప దాటి వెళితే మళ్ళీ రానని చెప్పిన కోడలు!

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్- 381లో.. శ్వేతతో కలసి కావ్య మాట్లాడుతుంది. గెట్ టూ గెదర్ ప్లాన్ చేస్తే ఆ వెన్నెల ఆచూకీ తెలుస్తుందని కావ్య అనగానే సరేనని శ్వేత అంటుంది. ఆ తర్వాత రాజ్ ని నమ్మి అలా నాటకం ఆడాను నన్ను క్షమించని శ్వేత అనగానే.. అయ్యో అందులో నీ తప్పేం లేదు. నేను అర్థం చేసుకోగలను. స్నేహితుడి కోసం అదంతా చేశావ్.. అంతే కదా.. అదేం పట్టించుకోకు.. ముందు ఈ వెన్నెల గురించి ఆలోచించు.. ఇది తేలితే నువ్వు నా జీవితానికి ఓ దారి చూపించినదానివి అవుతావ్.. నీకు నేను రుణపడిపోతానని కావ్య అంటుంది. అయ్యో అలాంటి మాటలెందుకు.. నువ్వు నన్ను క్షమించావ్ అది చాలని శ్వేత. మొత్తానికి కావ్య, శ్వేతలు మంచి స్నేహితులైపోయారు. 

మరోవైపు ఈ ఇంట్లో వెటకారాలు హేళనలు ఎక్కువైనాయండి అని సుభాష్ తో అపర్ణ అంటుంది. అదే నా బాధ కూడా అని సుభాష్ అంటాడు. ఇంతలో రాజ్.. బాబుని ఎత్తుకుని పైకి వెళ్తూ ఉంటే.. అపర్ణ చూసి అడ్డుపడుతుంది. నా స్థాయి పడిపోయింది. ఆజ్ఞాపించే స్థితి నుంచి అర్థించే స్థితికి రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో నువ్వే చెప్పమని రాజ్ ని అపర్ణ  అడుగుతుంది. నువ్వు క్షమించలేని వాళ్లని మరిచిపోవాలి.. మరిచిపోలేని వాళ్లని క్షమించాలి. అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉంటావని చెప్పి బాబుని తీసుకుని రాజ్ లోపలికి వెళ్లిపోతాడు. ఇక కాసేపటికి ఇందిరా దేవి టెన్షన్‌గా గుమ్మం దగ్గరే కావ్య కోసం ఎదురు చూస్తుంది. శ్వేతతో వేసిన స్కెచ్ గురించి కావ్య తన అమ్మమ్మకు చెబుతుంది. ఆ రుద్రాణి, ధాన్యలక్ష్మి కలిసి అత్తయ్యని తమ మాటలతో ఇబ్బంది పెడుతున్నారని కావ్య  అనగానే ఇందిరాదేవి బాధపడుతుంది‌. కాసేపటికి వాటర్, టాబ్లెట్స్ పట్టుకుని అపర్ణ దగ్గరకు వెళ్తుంది కావ్య. అత్తయ్యా.. ఈ టాబ్లెట్ వేసుకోండి అంటుంది కావ్య. టాబ్లెట్ వేసుకుంటే గంటకు తగ్గుతుంది. కానీ ఇంటికి పట్టిన అరిష్టం ఎలా పోతుంది.. ఎప్పుడు పోతుందంటూ అపర్ణ మొదలెడుతుంది. ఈ ఇంటికి కష్టాలు నష్టాలన్నీ నువ్వు అడుగుపెట్టిన నాటి నుంచి మొదలయ్యాయి.. నీ మీద ఇష్టం లేక నా కొడుకు పక్కదారి పట్టి ఉంటాడు.. వీటన్నింటికీ కారణం నువ్వే.. నిజంగా నా కొడుకు వల్ల నీకు అన్యాయం జరిగి ఉంటే.. ఇంకా ఎందుకు ఈ చూరుపట్టుకుని వేలాడుతున్నావ్? అందరు అనుకుంటున్నట్లు ఈ ఐశ్వర్యాన్ని వదులుకోలేకా? నీ పుట్టింటికి గతి లేకా అంటూ కావ్యతో అపర్ణ అంటుంది. అయితే మెట్ల దగ్గర నిలబడి రాజ్ మొత్తం వింటాడు. అక్కడే ఉన్న ఇందిరాదేవి అపర్ణ అని పిలిచి ఇంకెప్పుడు కావ్యని ఇలా అనకూడదని చెప్తుంది.

రాజ్ గదిలో ఉండగా కావ్య వస్తుంది. నేను ఓ మాట చెబుతాను వింటావా అని కావ్యతో రాజ్ అంటాడు. ఇప్పటిదాకా మీరేం చెప్పినా విన్నానంనంటుంది కావ్య. అయితే ఈ అవమానాలు కష్టాలు ఎందుకు నీకు.. వదిలేసి వెళ్లిపో.. ఏముంది ఇక్కడ?..సౌభాగ్యమా.. వైభోగమా? ఏంలేదు నీకంటూ.. కింద జరిగింది అంతా నేను విన్నాను.. నీకు ఎందుకు ఈ అవమానాలు? వెళ్లిపో.. నీకంటూ ఏం మిగల్లేదని చెప్పే సాక్ష్యం(బాబు) ఎదురుగా ఉంది. ఇంకా ఎందుకు ఇక్కడా అని రాజ్ అంటాడు. వెళ్తాను.. కానీ నా లెక్కలు నాకున్నాయి. ఉండటానికి నా కారణాలు నాకున్నాయి. అవన్నీ తేలాక అప్పుడు వెళ్తాను. కానీ గడప దాటి వెళ్లడం అంటూ జరిగితే.. జీవితంలో ఈ ఇంటి గడప తొక్కనని చెప్పేసి కావ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.