Read more!

English | Telugu

Brahmamudi : వెన్నెల కోసం కావ్య చేసే ప్రయత్నం ఫలిస్తుందా! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్- 379 లో..  రాజ్ ఆఫీస్ భాద్యతలు కళ్యాణ్ కి అప్పగించడానికి లాయర్ ని పిలిపిస్తాడు. రుద్రాణి మాత్రం తన మనసులో అధికారం మొత్తం రాహుల్‌కి రావాలని కోరుకుంటోంది. ఇక రాజ్ నిర్ణయాన్ని కావ్య కూడా వ్యతిరేకించింది. రాజ్ అంత పెద్ద నిర్ణయం తీసుకుంటే నువ్వేం మాట్లాడవేంటి కావ్యా? నీ అభిప్రాయం చెప్పవేంటి?’ అని ఇందిరా దేవి అంటే.. అభిప్రాయం.. నాది.. ఏ గుర్తింపు ఉందని నా అభిప్రాయానికి గుర్తింపు ఉంటుంది. నా దృష్టిలో రాజు ఎప్పుడూ రాజే.. రాజు సింహానం మీదే ఉండాలి తప్ప పరివారం మధ్య కాదు.. నాకు నా భర్త ఆస్తి మొత్తం కళ్యాణ్‌కి రాసి ఇచ్చినా అభ్యంతరం లేదు కానీ.. నా భర్త తన స్థానాన్ని కోల్పోవడం నేను చూడలేనని కావ్య అంటుంది.

బాబు కారణంగానే ఈ పరిస్థితి వచ్చింది. భార్య దగ్గర నమ్మకాన్ని కోల్పోయావు. తల్లి ప్రేమకు దూరం అయ్యావ్.. అందరిలో గౌరవాన్ని పోటొట్టుకున్నావ్.. ఇక నైనా ఆ బాబుని వదిలేస్తే.. నీ స్థానం నీకుంటుంది కదా?’ అంటూ అపర్ణ, ఇందిరా దేవి చెప్తారు. అయిన రాజ్  వినడు. నా ఆలోచనలు వేరు.. నా తీరు వేరు.. నీ స్థానం వేరు.. నీ స్థాయి వేరు.. కానీ ఇప్పుడు ఈ బాధ్యత నాకొద్దంటు కళ్యాణ్ చాలా బాగా చెబుతాడు. కానీ రాజ్ వినడు. అంతా రాజ్‌కి నచ్చజెబుతుంటే మాత్రం రుద్రాణి ఊరుకోదు. రాజ్ అయితే బిడ్డని వదులుకో.. లేదంటే అధికారాన్ని నీ తమ్ముడికి ఇవ్వు.. రెండటిల్లో ఏదో ఒకటి కచ్చితంగా చెయ్యాల్సిందే.. నీ ప్రయత్నం కరెక్టే అంటూ తనదైన శైలిలో మాట్లాడుతుంది రుద్రాణి. దాంతో రాజ్.. నేను బిడ్డను మాత్రం వదులుకోను. నాకు ఆస్తి అంతస్థులకంటే ఆ బిడ్డే ముఖ్యం.. దాని కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. పైగా మీరంతా ఆమోదించిందే ఈ నిర్ణయమని రాజ్ అంటాడు. ఇక రాజ్ పేపర్స్ మీద సంతకం పెడుతున్నప్పుడు కూడా సీతారామయ్య అడ్డుపడతాడు. ఇది నీకు నేను ఇచ్చిన వారసత్వం.. కళ్యాణ్ చిన్నవాడు. ఇంకా అనుభవం లేదు. పైగా ఈ బిజినెస్ మీద ఆసక్తి లేదు.. కళ్యాణ్ కూడా నా మనవడే. ఈ ఇంటి వారసుడే కానీ.. అడ్డుపడుతున్నాను అంటే ఆలోచించంటు సర్దిచెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ రాజ్ వినడు. క్షమాపణలు చెప్పి పేపర్స్ మీద సంతకం చేసి.. కళ్యాణ్‌కి అందిస్తాడు. ఆల్ ది బెస్ట్ రా కళ్యాణ్ అని రాజ్ అంటాడు.

రాజ్ చదువుకున్న స్కూల్ ప్రిన్సిపాల్‌కి కావ్య కాల్ చేస్తుంది. సర్ నేను కావ్యని, రాజ్ భార్యను.. రాజ్‌తో చదివిన బ్యాచ్ ఫోన్ నంబర్స్ పంపించిండి సర్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. మొదట కష్టం అన్న ఆ పెద్దాయన.. చివరికి సరే అంటాడు. ఆ ఫోన్ నంబర్స్ అన్నీ ఫొటో తీసి.. కావ్యకు పంపిస్తాడు. ఇక ఆయన పంపించిన నంబర్స్ చూసిన కళావతి.. ఇదేంటి అన్నీ ల్యాండ్ లైన్ నంబర్స్ ఉన్నాయి. అవునులే ఆయన టెన్త్ క్లాస్ అంటే.. అప్పుడే ఆ ఫోన్‌లే కదా అనుకుంటూ ఒక్కో నంబర్‌కి ట్రై చేస్తుంటుంది కావ్య. ఏ నంబర్ కలవదు. ఇక కావ్య.. ఆ లిస్ట్‌లో శ్వేత పేరు చూసి.. ఈ శ్వేత.. ఆయన ఫ్రెండ్ శ్వేతేనా? అంటే తనకు కాల్ చేస్తే ఏదైనా సమాచారం దొరుకుతుంది కదా? అనుకుంటూ శ్వేత ల్యాండ్ లైన్ నంబర్‌కి కాల్ చేస్తుంది. మొదటి రింగ్‌కి శ్వేత అక్కడికి వస్తుంది కానీ కట్ అవుతుంది. రెండో రింగ్‌కి శ్వేత లిఫ్ట్ చేస్తుంది. శ్వేత ఫోన్ లిఫ్ట్ చేసి.. హలో అనగానే.. హలో శ్వేతేనా అని కావ్య అంటుంది. అవునని శ్వేత అనగానే.. నువ్వు మా శ్వేతవేనా.. అంటే రాజ్ గారి ఫ్రెండ్‌వేనా అని కావ్య అంటుంది. అవును అంటుంది శ్వేత. శ్వేతా నేను కావ్యనని అంటుంది. కావ్యా నువ్వా? ఏంటి ఇలా కాల్ చేశావని అంటుంది శ్వేత. నేను అర్జెంట్‌గా నీతో మాట్లాడాలి. మనం కలుద్దామంటూ రిక్వెస్ట్ చేస్తుంది. శ్వేత కూడా సరే కలుద్దాం అని చెప్పడంతో చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది కావ్య. నీ సెల్ ఫోన్‌కి లొకేషన్ పెడతానని కావ్య అనగానే.. శ్వేత సరేనంటుంది. మరోవైపు రాహుల్‌ని వెంటబెట్టుకుని కళ్యాణ్ ఆఫీస్‌కి వెళ్తాడు. అనామిక చెప్పింది కాబట్టి రాహుల్‌ని జనరల్ మేనేజర్‌గా పెట్టుకున్నాను.. నాకు తెలుసు వీడు పనేం చేయడని కళ్యాణ్ తన మనసులో అనుకుంటాడు. ఇక శ్రుతి, మరో మేనేజర్ కలిసి రాహుల్, కళ్యాణ్ ల వెనుకే రాజ్ క్యాబిన్‌కి వస్తారు. రాజ్ కుర్చీని ఎమోషనల్‌గా చూస్తుంటాడు కళ్యాణ్. వెంటనే రాహుల్.. ఇక మీ కొత్త బాస్ కళ్యాణే.. రాజ్ ఇక రాడు అంటూ చెబుతుంటాడు. లేదు.. అన్నయ్య వస్తాడు. నేను కొంతకాలం మాత్రమే ఉంటానంటూ పక్కనే మరో కుర్చీ తీసుకుని.. రాజ్ చైర్ పక్కనే వేసుకుని అందులో కూర్చుంటాడు. తన అన్న మీద చూపించే గౌరవానికి రాహుల్ ధ్యావుడా అన్నట్లుగా చూస్తాడు. శ్రుతి అయితే చాలా గౌరవంగా చూస్తుంది. శ్రుతి.. ఇక నుంచి రాహుల్ జనరల్ మేనేజర్‌గా ఉంటారు. ఆయనకు పని అలర్ట్ చేయండి అని కళ్యాణ్ అనగానే శృతి సరే అంటుంది. ఇక రాహుల్ కన్ను శ్రుతి మీద పడుతుంది. ఆడవాళ్ల పిచ్చి ఉన్న రాహుల్.. గతంలో కూడా శ్రుతిని ఇబ్బందిపెట్టాడు. హా.. శ్రుతి.. నాకు సంబంధించిన ఫైల్స్ తీసుకుని నువ్వు మాత్రమే నా క్యాబిన్‌కి రా అంటూ రాహుల్ తన క్యాబిన్‌కి వెళ్తాడు. తప్పక సరే అన్నట్లుగా శ్రుతి సరే సర్ అంటుంది. తరువాతి ఎపిసోడ్ లో.. శ్వేత, కావ్య ఒక చోట రహస్యంగా కలుస్తారు. వెన్నెల గురించి శ్వేతకు కావ్య చెప్తుంది. మీ టెన్త్ క్లాస్‌లో ఉన్న వెన్నెల.. బాబు తల్లి వెన్నెల ఒకరే అనిపిస్తోంది. అందుకే నువ్వు తెలివిగా టెన్త్ ఫ్రెండ్స్ గెట్ టూ గెదర్ ఏర్పాటు చేసి.. అందరినీ రప్పిస్తే.. వెన్నెల కూడా వస్తుంది కదా.. అయితే ఇది మనిద్దరి స్కెచ్ అని రాజ్ కి తెలియకూడదని శ్వేతతో కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.