Read more!

English | Telugu

ట్రెండింగ్ లోకి బ్రహ్మముడి సీరియల్ డైరెక్టర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్ ఎంత పాపులర్ అవుతుందో అందరికి తెలిసిందే.. ఇందులో ఒక్కో పాత్రకి ఒక్కో ప్రాధాన్యతను‌ ఇస్తూ కథని ముందుకి తీసుకెళ్తున్నాడు డైరెక్టర్ చింటు పంతం. 

బ్రహ్మముడి కి ఇంత పాపులారిటీ రావడానికి కారణం కథ బాగుండటం ఒకటైతే.. ఇందులోని నటీనటులు మరొక కారణం.. హీరో రాజ్ పాత్రలో మానస్ నేచురల్ గా నటిస్తుండటం ఈ సీరియల్ కి మరింత ఫ్యాన్ బేస్ వచ్చింది. అయితే దుగ్గిరాల కుటుంబానికి  కనకం-కృష్ణమూర్తిల కుటుంబానికి మధ్య ఉన్న అంతులేని దూరాన్ని బ్రహ్మముడి వేసి కలిపేశాడు డైరెక్టర్ చింటు పంతం. మధ్యతరగతి కుటుంబంలో ముగ్గురు కూతుర్లు ఉన్న తల్లి కనకం పాత్రలో నీప ఆకట్టుకుంటుంది. కనకం పెద్ద కూతురిగా స్వప్న రిచ్ లుక్ లో కనిపిస్తూ టైం దొరికినప్పుడల్లా రాహుల్ తో ప్రేమాయణం నడుపుతుంది. ఇక స్వప్నకి చెల్లెలుగా కావ్య అలియాస్ దీప రంగరాజు ఆ పాత్రలో ఇమిడిపోయింది. స్వప్న, కావ్యల ముద్దుల చెల్లెలు లేడీ రౌడీగా అప్పు మాస్ యాక్టింగ్ తో ఇరగదీస్తుంది. అయితే ఈ కథలో ముఖ్య పాత్రలుగా రాజ్-కావ్యలను ఎంచుకున్న చింటు పంతం.. వీరిద్దరిని కలపడానికి ముందు వీరి మధ్య ఎక్కువ దూరాన్ని కలిగించి.. ఆ తర్వాత దూరాన్ని తగ్గిస్తూ బ్రహ్మముడి ఉందంటూ మళ్ళీ కలిపేస్తున్నాడు.

డైరెక్టర్ చింటు పంతం తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఎంచుకున్నాడు. కథలో కావ్య పాత్రకి సింప్లిసిటిని అద్ది, బాగా డబ్బున్న కుటుంబంలోని వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తుండటం ఈ 'బ్రహ్మముడి' కి అదనపు బలాన్నిస్తున్నాయి. స్వప్న పాత్రలో హమీదా, కావ్యగా దీపిక రంగరాజు, అపర్ణగా శ్రీప్రియ, రాజ్ గా మానస్, కళ్యాణ్ గా కిరణ్, కనకంగా నీపా, రుద్రాణి పాత్రలో షర్మిత గౌడ.. ఇలా అందరూ తమ ఇన్ స్టాగ్రామ్ , యూట్యూబ్ లలో ట్రెండింగ్ లో ఉన్నవాళ్ళే.. ఇలా అందరికీ ఫ్యాన్ బేస్ ఉంది. చింటు పంతం రాసిన ఈ కథలో కలిగే ట్విస్ట్ లకి, కుటుంబ విలువలకి సీరియల్ చూడటం కోసం ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సీరియల్ ముందు వరకు ఎవరికి అంతగా తెలియని డైరెక్టర్ చింటు పంతం.. బుల్లితెరపై ఈ సీరియల్ ని ఆరాధించే అభిమానుల వల్ల అందరికి తెలిసిపోయాడు. అతను ఇప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ లో ఏం పోస్ట్ చేసినా మంచి స్పందన లభిస్తుంది.