Read more!

English | Telugu

Brahmamudi:తృటిలో తప్పించుకున్న తల్లి కొడుకులు! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -387 లో....రాజ్ కావ్య వస్తుంటారు. చాలా పక్కడ్బందిగా ప్లాన్ చేసినట్లున్నావ్ బాబు తల్లి ఎవరో కనుక్కోవడానికి అని రాజ్ అంటాడు. నువ్వు, శ్వేత మాట్లాడుకోవడం విన్నానని అనగానే.. హా చేసాం అయితే ఏంటి.. మీరు మాత్రం ఏదో ఒక పేరు చెప్పారు.. ఎలాగు రాలేదని కావ్య అంటుంది. ఆ తర్వాత ఇద్దరు కాసేపు వాదించుకుంటారు. నువ్వు ఆ బాబు తల్లిని కనిపెట్టలేవని కావ్యతో రాజ్ అంటాడు.

మరొకవైపు కళ్యాణ్ తో ఎలాగైనా ఫైల్ పై సంతకం చేయించాలని రాహుల్, రుద్రాణి అనుకుని.. కళ్యాణ్ దగ్గరకి రాహుల్ వచ్చి ఫైల్ చూడమని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కళ్యాణ్ ఫైల్ చూసే టైమ్ కు అనామిక వచ్చి.. రేపు మా ఇంటికి వెళదామని అంటుంది. దాంతో కళ్యాణ్ చిరాకుపడగా.. అనామిక కోపంగా వెళ్ళిపోతుంది. ఇక కళ్యాణ్ ఫైల్ చూడకుండా క్లోజ్ చేస్తాడు. దాంతో రాహుల్, రుద్రాణి ఇద్దరు డిస్సపాయింట్ అవుతారు. మరొకవైపు  కావ్య, రాజ్ లు ఇంకా రావడం లేదని ఇందిరాదేవి టెన్షన్ పడుతుంది. కాసేపటికి రాజ్ వస్తాడు. కావ్య రాలేదు అనుకునేలోపే కావ్య వస్తుంది. ఇక కావ్య జరిగిందంతా ఇందిరాదేవికి చెప్తుంది. బాబుకి వాడు తండ్రి కాదన్న విషయం తెలిసిందే. అసలు ఇంత పెద్ద అబద్ధం ఎందుకు చెప్పాడో కావ్య కనుక్కోవాలనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం కళ్యాణ్ ఫైల్ చూస్తుంటే.. రాహుల్ తను ఇచ్చిన ఫైల్ పై ఎప్పుడెప్పుడు సంతకం పెడతాడో అని పై నుండి చూస్తుంటాడు. కాసేపటికి కళ్యాణ్ దగ్గరికి రాజ్ వచ్చి.. మాట్లాడతాడు. కాంట్రాక్ట్ గురించి ఎక్కడ రాజ్ కి కళ్యాణ్ చెప్తాడో అని రాహుల్ టెన్షన్ పడుతాడు కానీ రాజ్ కి కళ్యాణ్ చెప్పడు.

ఆ తర్వాత కావ్య వెళ్తుంటే కళ్యాణ్ పిలుస్తాడు. ఆ కాంట్రాక్ట్ గురించి చెప్తాడు. ఇదేదో నా మీదకు వచ్చేటట్టు ఉందని రాహుల్ వెళ్లి.. ఆ కాంటాక్ట్ పెద్ద ఫ్రాడ్ అంట.. మా ఫ్రెండ్ ద్వారా తెలిసిందంటు ముందే కళ్యాణ్ కి చెప్తాడు.. తప్పు జరగకముందే చెప్పావని రాహుల్ తో కళ్యాణ్ అంటాడు. ఇక అక్కడే ఉన్న కావ్య.. రాహుల్ తో కొంచెం జాగ్రత్త అని చెప్తుంది.. ఆ తర్వాత రాహుల్ కొద్దిలో దొరికిపోయేవాన్ని అనుకుని రుద్రాణికి చెప్తాడు. అప్పుడే స్వప్న వచ్చి.. నైట్ ఏం జరిగిందని అడుగుతుంది. నువ్వు డాన్స్ చేసావని రాహుల్ చెప్తాడు. ఆ తర్వాత బాబు ఏడుస్తుంటే డాక్టర్ కి రాజ్ ఫోన్ చేసి.. ఏడుస్తున్న విషయం చెప్తాడు. అలాగే ఏడిస్తే కాల్ చెయ్యండి సిరప్ చెప్తానని డాక్టర్ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.