Read more!

English | Telugu

Brahmamudi: షాకిచ్చిన వెన్నెల.. బాబు తల్లి చనిపోయింది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -386 లో... వెన్నెల కోసం కావ్య ఎదురుచూస్తుంటే.. అప్పుడే రాజ్ వస్తాడు. తనని చూసిన రాజ్.. ఇక్కడేం చేస్తున్నావని అడుగుతాడు. ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నానని శ్వేత అంటుంది. అయిన ఇప్పుడు వచ్చే వెన్నెల గురించి చెప్తే ఏమవుతుందని అనుకుంటుంది శ్వేత. వెన్నెల వస్తుందని రాజ్ కి చెప్పగానే షాక్ అవుతాడు. అప్పడే కావ్య వచ్చి వెన్నెల అంటేనే టెన్షన్ పడుతున్నారు.. కొంపతీసి మీరు చెప్పిన వెన్నెల వస్తుందా అని కావ్య అంటుంది. దాంతో రాజ్ చిరాకు పడతాడు.. అప్పుడే వెన్నెల వస్తుంది.

మరొకవైపు స్వప్నకు జ్యూస్ లో ఏదో కలిపి.. రుద్రాణి ఇస్తుంది. ఆ తర్వాత రాహుల్ , రుద్రాణి ఇద్దరు కలిసి స్వప్నతో సంతకం చేయించాలని తన గదికి వెళ్లేసరికి స్వప్న మత్తులో డాన్స్ చేస్తుంటుంది. రాహుల్ కూడా స్వప్న తో డాన్స్ చేస్తుంట.. రుద్రాణి ఆస్తి పేపర్స్ తీసుకొని వస్తుంది. ఆ తర్వాత స్వప్నతో సంతకం చేయిస్తారు. ఎలాగైతే ఏంటి సంతకం పెట్టించామంటూ ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొకవైపు వెన్నెలని చూసి అందరు షాక్ అవుతారు. తన ఫ్రెండ్స్ వచ్చి ఇన్ని రోజులు ఏమైపోయావ్ వెన్నెల అంటు అడుగుతారు. నా కథ చెప్పడానికే వచ్చానంటూ వెన్నెల స్టేజ్ మీదకి వెళ్లి.. మీరు అనుకుంటున్నట్టు నేను వెన్నెల కాదు.. తను, నేను కవల పిల్లలం. తనకి హెల్త్ బాలేక చనిపోయిందని ఆమె చెప్తుంది. అదే విషయం రాజ్ కలిసినప్పుడు చెప్పానని తను అంటుంది. దాంతో కావ్య పక్కకి వెళ్లి ఎమోషనల్ అవుతుంది. తన వెంట శ్వేత కూడా వెళ్తుంది.

ఆ తర్వాత ఏమైందని శ్వేత అడుగుతుంది. తనే వెన్నెల అనుకొని చాలా బయపడిపోయాను. ఎక్కడ నా భర్తని వదిలేసి వెళ్లాలోనని భయమేసిందని కావ్య అంటుంది. ఎప్పుడో చనిపోయిన వెన్నెల పేరు ఎందుకు చెప్పారో కనుక్కోవాలని శ్వేతతో కావ్య అంటుంది. తరువాయి భాగంలో బాబుకి జ్వరం గా ఉండడంతో రాజ్ , కావ్య ఇద్దరు హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. బాబుకి ఇప్పుడు తల్లి స్పర్శ కావాలి వెంటనే తల్లికి బాబుని ఇవ్వండి అని డాక్టర్ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.