English | Telugu

50 రోజులు మాత్రమే.. ఊహించని కంటెస్టెంట్స్‌తో బిగ్‌బాస్ సీజన్ 8

 

బిగ్ బాస్ తెలుగుకి రెండు రాష్ట్రాలలో విపరీతమైన క్రేజ్ ఉంది.  ఎవరి ఊహకి అందకుండా అత్యధిక టీఆర్పీతో దూసుకెళ్ళే ఈ షో మరో సీజన్ కి ముస్తాబవుతోంది. ఇప్పటికి ఏడు సీజన్లు పూర్తి చేసుకొని ఎనిమిదవ సీజన్ ఎప్పుడెప్పుడా అనే క్యూరియాసిటిని పెంచేస్తుంది. 

సాధారణంగా ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ వేదికగా బిగ్ బాస్ తెలుగుకి సంబంధించిన పోస్ట్ లు, వీడియోలు రెగ్యులర్ గా ట్రెండింగ్ లో ఉంటాయి. ఇక సీజన్ మొదలవుతుందనే వార్త బయటికి వస్తే అంతే. సెప్టెంబర్ నెలలో బిగ్ బాస్ సీజన్ 8 మొదలవుతుందనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దాంతో మరో యాభై రోజుల్లో ప్రారంభం అవుతుందని చెప్తూ కంటెస్టెంట్స్ లిస్ట్ కోసం నెటిజన్లు తెగ పోస్ట్ లు  చేస్తున్నారు. మరి అలా నెటిజన్లు మాట్లడుకునే వారి లిస్ట్ పెద్దగానే ఉంది. వాటిల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు.. రీతూ చౌదరీ, వేణు స్వామి, ఫార్మర్ నేత్ర, సురేఖ వాణి లేదా తన కూతురు సుప్రిత, కిరాక్ ఆర్పీ, కుమారీ ఆంటీ, బుల్లెట్ భాస్కర్, బర్రెలక్క, చమ్మక్ చంద్ర, కుషిత కల్లపు, అమృత ప్రణయ్ లాంటి వారి పేరు ఎక్కువగా వినిపిస్తుంది.

బిగ్ బాస్ కొత్త సీజన్ మామూలుగా ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ప్రారంభమవుతుంది. అలాగే బిగ్ బాస్ సీజన్ 8 కూడా సెప్టెంబర్ లో మొదటి వారం నుండి ప్రారంభం కానుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ ఈ సీజన్ నిజంగానే సెప్టెంబర్‌లో ప్రారంభం అయితే ఆగస్ట్ నుండే హౌజ్ ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. అలా సెట్ పూర్తయితే రెగ్యులర్ గా అప్డేట్స్ వస్తుంటాయి. ఇక హోస్ట్ కూడా నాగార్జుననే అని మళ్ళీ మారిస్తే టీఆర్పీ తగ్గిపోతుందని  బిబి టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ చేంజ్ చేస్తే అప్‌డేట్ ముందే వచ్చేస్తుంది. ప్రస్తుతానికి బిగ్ బాస్ సీజన్ సెప్టెంబరు మొదటి వారంలో మొదలవుతుందనే వార్త నెట్టింట వైరల్ గా మారింది.