English | Telugu

Bigg Boss 9 Telugu Voting 14th week: ఓటింగ్‌లో తనూజ టాప్.. సుమన్ శెట్టికి ఆ భయం లేదు!


బిగ్ బాస్ సీజన్-9 లో పదమూడో వారం రీతూ చౌదరి ఎలిమినేషన్ అవ్వగా హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో కెప్టెన్ కళ్యాణ్ కాబట్టి అతను నామినేషన్లో లేడు. ఇక మిగిలిన ఆరుగురిలో ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారో.. ఎవరు టాప్ లో ఉన్నారో ఓసారి చూసేద్దాం.

ప్రతీ వారంలో లాగే తనూజ ముప్పై శాతం ఓటింగ్ తో టాప్ లో ఉంది. సంజన గల్రానీ కి పదిహేను శాతం ఓటింగ్ పడుతోంది. డీమాన్ పవన్ 14.91 శాతంతో మూడో స్థానంలో ఉన్నాడు. భరణి 14.7 శాతం ఓటింగ్ తో నాల్గవ స్థానంలో ఉన్నాడు. 13.6 శాతం ఓటింగ్ తో ఇమ్మాన్యుయేల్ అయిదో స్థానంలో ఉన్నాడు. ఇక చివరగా 10.78 శాతం ఓటింగ్ తో సుమన్ శెట్టి లీస్ట్ లో ఉన్నాడు. అయితే సుమన్ శెట్టి లీస్ట్ లో ఉన్నా అతను ఎలిమినేషన్ కాడు.. ఎందుకంటే సుమన్ శెట్టి ప్రభంజనం అలాంటిది. గతవారం సుమన్ శెట్టి లీస్ట్ లో ఉండి.. తనపైన సంజన, రీతూ ఉండగా.. రీతూని ఎలిమినేషన్ చేసాడు బిగ్ బాస్. అంటే ఈ సారి కూడా సుమన్ శెట్టి ఎలిమినేట్ కాడు. దివ్య, రీతూ చౌదరి, నిఖిల్, దమ్ము శ్రీజ, గౌరవ్ .. వీళ్ళందరి కంటే సుమన్ శెట్టి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆ.. కాదు.. కానీ హౌస్ లో ఉంటాడు. ఎందుకంటే అదే సుమన్ శెట్టి ప్రభంజనం.

సంజన, సుమన్ శెట్టిలకి బిగ్ బాస్ బయాజ్డ్ ఉన్నాడని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. హౌస్ లో ఎవరెంత ఆడినా, ఆడకపోయినా రిస్క్ ఉంటుంది.. భయం ఉంటుంది.‌ కానీ సుమన్ శెట్టికి ఆ భయం లేదు. ఎందుకంటే పదమూడు వారాల్లో అతనేం చేయకపోయినా ఎలిమినేట్ అవ్వడం లేదు.. అసలేం చేశాడో.. ఎందుకు హౌస్ లో ఉంచుతున్నారో బిగ్ బాస్ మామకే తెలుసు. అయితే ఓటింగ్ ప్రకారం సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్ డేంజర్ జోన్ లో ఉన్నారు.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.