English | Telugu

Bigg Boss 8 : ఇది తెలుగు బిగ్ బాసా లేక కన్నడ బిగ్ బాసా?.. దుమారం రేపుతున్న ఇష్యూ!

బిగ్‌బాస్ సీజన్ 8 మొదలైనప్పటి నుంచి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అదే కన్నడ బ్యాచ్.. పృథ్వీ, నిఖిల్, ప్రేరణ, యష్మీ.  సీజన్-8 మొదలైన రోజు హౌస్ లోకి ఎక్కువ మంది కన్నడ నటులను బిబి టీమ్ తీసుకుందంటూ నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. అసలు ఇది తెలుగు బిగ్‌బాస్ షోనా లేకుంటా కన్నడా బిగ్‌బాస్‌ షో అన్నట్టు విమర్శులు చేశారు.

హౌస్‌లోకి వెళ్లిన వారంతా ఫ్లూయెంట్‌గా తెలుగులో మాట్లాడుతుండటంతో.. ఫర్వాలేదు అనిపించారు. వారి ఆట తీరుతో కూడా ఆకట్టుకున్నారు.  అంతే కాకుండా వారికి ఉన్న సీరియల్‌ ఫాలోవర్స్ కూడా ఓట్లు వేస్తున్నారు. దీంతో వాళ్లను ఓ బ్యాచ్‌గా చూడటం మొదలు పెట్టారు పోటీదారులు. వాళ్ల బిహేవియర్‌ కూడా అలానే ఉండటంతో కొత్త వివాదానికి దారి తీసింది. నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, యష్మి, ఈ నలుగురు ఇటు సీరియల్‌ బ్యాచ్‌గానే కాకుండా కన్నడ బ్యాచ్‌గా ముద్రపడిపోయారు. సోషల్ మీడియాలో దీనిపై రచ్చ జరిగేదే. కానీ ఇప్పుడు ఈ విభేదాలు హౌస్‌లో కూడా వచ్చినట్టు స్పష్టమైంది. తాజాగా మెగా చీఫ్ కంటెండర్‌ టాస్క్‌లో నబీల్ గురించి ప్రేరణ డిస్కష్ చేస్తూ ఈ విషయాన్ని ప్రస్తావించింది. పదోవారంలో నిర్వహిస్తున్న మెగా చీఫ్‌ కంటెండర్‌ టాస్క్‌లో ముందు యష్మీ బాక్స్‌లో ఎక్కువ మూటలు ఉన్నందున ఆమెను మొదట తప్పించారు. తర్వాత రౌండ్‌లో నబీల్‌ను తప్పించారు. ఇక్కడ వివాదం మొదలైంది. ప్రేరణ వెళ్లి తనకు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేసింది. తన వాళ్లతో మాట్లాడి చెబుతానంటూ నబీల్ అనడాన్ని ప్రేరణ తప్పుపట్టింది. ఇక అక్కడే ఉన్న హరితేజ.. మా వాళ్లు అంటే అవినాష్, రోహిణి, గౌతమ్‌ అని చెప్పుకొచ్చింది. దీంతో ఆ వివాదం అక్కడ ముగిసినట్టే కనిపించినా వారి మనసులో ఉన్న భావన మాత్రం బయటకు వచ్చిందని ప్రేకక్షలు భావిస్తున్నారు. 

యష్మీ, పృథ్వీ, నిఖిల్ ఆట తీరు కూడా తమ నలుగురికి సపోర్ట్‌గానే ఉంటోంది. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతమైన వివాదం నడుస్తోంది. రెండు భాషల మధ్య విభేదాలు సృష్టించే విధానం మంచిది కాదనే వాళ్లు ఉన్నారు. మొత్తానికి రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారుతున్న ఈ ఇష్యూకు ఫుల్‌స్టాప్ పెట్టాలంటూ ప్రేకక్షలు కోరుతున్నారు. దీనిపై నాగార్జున స్పందించి పరిష్కరిస్తాడో లేదో చూడాలి మరి.