Read more!

English | Telugu

ముకుందని విసిగించకుండా వెళ్ళమని చెప్పిన భవాని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -149 లో.. కృష్ణ మోకాళ్ళపై గుడిమెట్లు ఎక్కుతుంటే.. అక్కడి పూజారి చూసి మురారికి ఫోన్ చేసి చెప్తాడు. అప్పుడు వెంటనే మురారి గుడికి వస్తాడు. తనని అలా మోకాళ్ళపై నడవడం చూసిన మురారి.. ఆగు కృష్ణ ఎందుకు ఇలా చేస్తున్నావ్? ఇంత కఠినమైన మొక్కు ఎందుకు మొక్కుకున్నావ్ అని అడుగుతాడు. కృష్ణ సమాధానమేం చెప్పకుండా.. తను ఇన్ని రోజులు మురారిని అపార్థం చేసుకొని తప్పు చేశానని తన కాళ్లకి మొక్కుతుంది. కృష్ణ ఏం చేస్తుందో అర్థం కాని మురారి మాత్రం ఆశ్చర్యంగా చూస్తాడు.

మరొకవైపు భవాని దిగులుగా హాల్లో కూర్చుని ఉంటుంది. అప్పుడే ముకుంద వచ్చి ఏమైంది అత్తయ్య అని అడుగుతుంది. ఒంటరిగా ఉండాలని ఉందని అంటుంది భవాని. నాకు తెలుసు అత్తయ్య మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో.. దీనంతటికి కారణం ఆ కృష్ణనే అత్తయ్య.. మీ ఇంట్లో మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారంటే దానికి కారణం కృష్ణ అని అంటుంది. తప్పుడు పని చేసే వారికంటే, చెప్పుడు మాటలు విని తప్పు చెయ్యడమే పెద్ద తప్పు ఆ తప్పు నేను చెయ్యలేనని భవాని అనగానే.. నావి చెప్పుడు మాటలు కాదు అత్తయ్య.. మీరే ఆలోచించండి.. మీ కూతురిని, కొడుకుని దూరం చేసింది.. అంతకుముందు వరకు ఈ ఇంట్లో మీకు ఎదురు అనేదే లేదు.. తనొచ్చాక మీకు ఇంట్లో ఎదురు తిరగడం మొదలైంది. మురారి అటు గౌతమ్ కి మాట ఇచ్చి.. కృష్ణకి మాట ఇచ్చి.. మీక్కూడా మాట ఇచ్చాడు. ఇదంతా ఎవరి ప్రభావం వల్ల.. తనవల్లే.. కృష్ణ వల్లనే అత్తయ్య.. మీరు ఆలోచించండి.. ఇంత చేస్తున్నా కృష్ణని మీరు ఇంట్లో నుండి బయటకు పంపించకుండా మౌనంగా ఉన్నారని ముకుంద అంటుంది. కృష్ణ ఉండడం వల్ల నాకేంటి ప్రాబ్లెమ్.. ప్లీజ్ ముకుంద నన్ను విసిగించకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోమని భవాని అంటుంది.

మరొకవైపు కృష్ణని తీసుకొని మురారి కాఫీ షాప్ కి వెళ్తాడు. ఏం తిందామని కృష్ణని అడగగానే.. మీకు ఏది ఇష్టమైతే అది తిందామని కృష్ణ అనగానే.. ఏంటి ఈ రోజు వింతగా మాట్లాడుతున్నావ్.. నాకు ఇష్టం ఉన్నవి.. నీకు ఇష్టం ఉండవ్ కదా అని మురారి అంటాడు. అదేం లేదు మీకు నచ్చినట్టు ఉందామని అనుకుంటున్నాని కృష్ణ అంటుంది. సరే గాని ఏం మొక్కుకున్నావ్? అంత కఠినమైన మొక్కా అది? నందు పెళ్లి జరిగితే అలా మోకాళ్ళపై వస్తానని మొక్కుకున్నావా అని మురారి అడుగుతాడు. అదే అనుకోండని కృష్ణ సమాధానమిస్తుంది. ఈరోజు ఎందుకు చాలా హ్యాపీగా కన్పిస్తున్నావ్.. ఏంటి కృష్ణ అని మురారి అంటాడు. నా మనసులో ఉన్న అపార్థాలు.. మబ్బులు అన్ని తొలగిపోయాయని కృష్ణ అంటుంది. అప్పుడే వెయిటర్ స్వీట్ తీసుకొని వచ్చి ఇవ్వగా.. మురారికి కృష్ణ ప్రేమతో తినిపిస్తుంది. మొత్తానికి కృష్ణకి నిజం తెలిసి మురారిపై ప్రేమ కలుగుతుంది. అది అర్థం కాని మురారి ఆలోచనలో పడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.