Read more!

English | Telugu

గౌతమ్ మీద రెట్టింపైన భవాని పంతం.. కృష్ణకి తెలిసిపోయిందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న  సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -119 లో.. కృష్ణతో మురారి మాట్లాడుతుంటాడు. నువ్వు గ్రేట్ కృష్ణ.. దేనికి బయపడవు. ఎదురు ఉండి పోరాడతావు.. నీ ముందు అన్యాయం జరిగితే నువ్వు ఒప్పుకోవు అని మురారి అంటాడు. సర్ ఏంటి మీరు.. ఇలా మాట్లాడుతున్నారు. స్టేషన్ కి వెళ్ళరా అని కృష్ణ అడుగుతుంది. మరోవైపు భవాని, ఈశ్వర్, ప్రసాద్ ముగ్గురు కలిసి గౌతమ్ గురించి మాట్లాడుకుంటారు. వాడికి ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి నన్ను అత్తయ్య అంటాడు.. వాణ్ణి ఇంకొకసారి ఈ ఇంటి గడప దాటకుండా చెయ్యాలని భవాని అంటుంది. నాకు చాలా కోపం వచ్చింది ఎక్కడ ఇంట్లో వాళ్ళకి నందు ప్రేమ విషయం బయటపడుతుందో అని సైలెంట్ గా ఉన్నానని ఈశ్వర్ అంటాడు. అసలు కృష్ణకి వాడు నందు గురించి చెప్పి ఉంటాడా అని డౌట్ పడతాడు ఈశ్వర్. ఏది ఏమైనా ఇది నా జీవితంలో ఒక సవాలు.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. వాణ్ణి వదిలిపెడితే నేను ఓడినట్లే అని భవాని అంటుంది. 

మరోవైపు కృష్ణతో చాట్ చేస్తాడు మురారి. నీతో మాట్లాడాలి కృష్ణ.. నీకు దండం పెడతాను. నువ్వు ఇలా ఉండకు.. ఎప్పటిలాగా మనం ఫ్రెండ్లీ గా ఉందాం.. నువ్వు ఇలా ఉంటే నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. నువ్వు ఇప్పుడు నా దగ్గరికి వస్తేనే నేను డ్యూటీకి వెళ్తానని మెసెజ్ చేసి కార్ దగ్గర ఎదురు చూస్తుంటాడు. అప్పుడే ముకుంద వచ్చి మాట్లాడుతుంది. నాకోసమే ఎదురుచూస్తున్నావా మురారి అని ముకుంద అడుగగా.. లేదని చెప్తాడు. ఆ తర్వాత కాసేపటికి కృష్ణ వస్తుంది. ముకుంద మురారిలని చూసిన కృష్ణ.. మీరు మాట్లాడుకుంటున్నారు కదా.. మాట్లాడడం అయిపోయాక వస్తా అని కృష్ణ వెళ్తుంటే మురారి తన చెయ్యి పట్టుకొని ఆపుతాడు. కృష్ణ కోపంగా చెయ్యి వదలండి.. నా చెయ్యి పట్టుకునే అర్హత మీకు లేదని కృష్ణ అంటుంది. సరే నేను తర్వాత మాట్లాడుతానని మురారి అనగానే.. నేను తర్వాత మాట్లాడను అని చెప్పేసి కృష్ణ వెళ్ళిపోతుంది. ముకుంద నువ్వు ఇంత మొండిగా ఎందుకు చేస్తున్నావ్? అని మురారి అడుగుతాడు. నాది ప్రేమ అని ముకుంద ఏదో చెప్తుండగానే.. అక్కడ నుండి వెళ్ళిపోతాడు మురారి. ఏంటి ఈ మురారి.. కృష్ణకు దగ్గర అవ్వాలని చూస్తున్నాడా? లేక నాకు దూరమవ్వాలని చూస్తున్నాడా అని అనుకుంటుంది ముకుంద. 
 
ఆ తర్వాత నందు మెట్ల మీద నుండి వెళ్తుండగా కృష్ణ తనని ఆపుతుంది. ఏమైంది నందు? ఎక్కడికి వెళ్తున్నావని కృష్ణ అడుగగా.. సిద్దు కావాలి అంటుంది. సిద్దు లేడమ్మా అని కృష్ణ చెప్తుంది. ఇదంతా దూరంగా భవాని చూస్తుంది. ఆ తర్వాత కృష్ణని పిలిచి.. నందు ఏం అంటుందని అడుగుతుంది. సిద్దు కావాలంట అత్తయ్య.. ఈ గౌతమ్ సార్ వచ్చాడు కదా, నందుకి సిద్దు వచ్చినట్లుగా అనిపించిందంట అని చెప్తుంది. ఈ సిద్దు ఎవరు అత్తయ్యా అని కృష్ణ అడుగుతుంది. తెలిసి అడుగుతుందా లేక తెలియకుండానా అని మనసులో అనుకొని.. నందు చిన్ననాటి ఫ్రెండ్ అని కవర్ చేసి భవాని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు స్టేషన్ కి వెళ్ళిన మురారి.. కృష్ణ ఆలోచనలోనే ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.