Read more!

English | Telugu

ఒక్క క్షణం పట్టదు.. అత్తింటి గౌరవం కోసం ఆగుతున్నాను!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్‌-108లో.. నందుకి ట్రీట్‌మెంట్ చేస్తూ గౌతమ్ ఎమోషనల్ అవుతాడు. "నందు‌ ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావ్. ఏం చేసైనా నిన్ను కాపాడుకుంటాను. ఎలాగైనా నిన్ను దక్కించుకుంటాను" అని గౌతమ్ అంటాడు. ఆ తర్వాత కృష్ణ లోపలికి రావడంతో తనకి నందుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి బయటకు వచ్చేస్తాడు. గౌతమ్ వెళ్తున్నప్పుడు నందుకి ఎలా ఉందని అడుగుతుంది భవాని. అవుటాఫ్ డేంజర్ మిగతా విషయాలు కృష్ణ చెప్తుందని చెప్పి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత నందు కోసం గౌతమ్ తన గదిలో బాధపడుతుంటాడు. నందిని దగ్గరికి ఇంజక్షన్ తీసుకొని కృష్ణ వెళ్తుండగా.. భవాని చూసి ఆపుతుంది. ఎక్కడికి? ఈ ఇంజక్షన్ ఎందుకు అని భవాని అడిగేసరికి.. నందు కోసమని కృష్ణ చెప్తుంది. ఆ ట్యాబ్లెట్స్ వల్లే కదా నందినికి అలా జరిగిందని భవాని ప్రశ్నిస్తుంది. "ట్లాబ్లెట్స్ విషయంలో ఎక్కడో ఏదో తేడా జరిగింది" అని కృష్ణ అంటుంది. ఈ ఇంజక్షన్ విషయంలో మళ్ళీ ఆ తేడా జరగదని గ్యారెంటీ ఏంటని భవాని అడుగుతుంది. ప్రయోగాలు చేయడానికి నందినే దొరికిందా అని నందిని వాళ్ళ బాబాయ్ కృష్ణని అడుగుతాడు.

నందినిని తన ప్రాక్టీస్ కోసం వాడుకుంటుంది. తను చేస్తున్న ప్రయోగం ఫెయిల్ అవుతుందనే తనకి ట్యాబ్లెట్ వేసిందని ముకుంద చెప్తుంది. నువ్వు డాక్టర్ వే కదా.. చూసుకోవాలి కదా అని భవానీ అనగా.. మా సీనీయర్ డాక్టర్ ఇచ్చాడని నేను చూసుకోలేదని కృష్ణ అంటుంది. మీ వచ్చీరాని వైద్యంతో నా కూతురిని బలిచేద్దామని అనుకున్నారా అని భవానీ అడుగుతుంది. నందినిని ఒక పసిపాపలా చూసుకుంటున్నాను అత్తయ్య అని కృష్ణ అనగానే.. "మీ ఆయన కూడా నిన్ను ఒక పసిపాపలా వదిలేస్తేనే ఇలా చేసావ్" అని ముకుంద అంటుంది. మా సీనియర్ డాక్టర్ ని కనుక్కొని చెప్తాను అని గౌతమ్ కి ఫోన్ చేస్తుంది కృష్ణ.. లౌడ్ స్పీకర్ ఆన్ చేయమంటుంది ముకుంద.. ఏమైంది.. ఫోన్ ఆన్సర్ చేయలేదా? అని భవాని అంటుంది. దీనికి శిక్ష పాడాల్సిందే కదా అని భవానీ అనగా.. మురారి నువ్వడిగిన ఆధారాలు ఇవే కదా ఇంకెందుకు కృష్ణని వెనకేసుకొస్తున్నావ్ అని ముకుంద అనగా.. స్టాపిట్ అని కృష్ణ అరుస్తుంది. "ఏం చేశాను నేను.. నందిని నేను ఇన్నిరోజులు ఎంత బాగా చూసుకున్నానో‌ మీరెవరూ చూడలేదా? తన కోసం ఎంత ఆరాటపడ్డానో మీరు గమనించలేదా? నందిని నాకేమైనా శత్రువా? నన్నే కాదు ఏసీపీ సర్ ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఆయనికి నందిని అంటే ఇష్ణం లేదా?.. నేను ఇప్పుడు ఈ క్షణం నా డబ్బుతో నేను ఒక కార్ కొనుక్కోగలను కానీ అత్తింటి గౌరవాన్ని కాపాడటానికి చూస్తున్నాను" అని కృష్ణ చెప్పుకొచ్చింది.

ఇప్పటివరకు ఎవరైనా నాకు ఎదురుతిరిగారా అని భవానీ అనగా.. "నేను మీకు ఎదురుతిరగలేదు. నాకు ఒక ఆత్మాభిమానం ఉంటుంది కదా‌.. ఇంతమంది ఒక్కటిగా చేరి నన్ను దోషిలా నిలబెడుతుంటే తట్టుకోలేకపోయాను" అని కృష్ణ ఏడుస్తుంది. ఈ ఇంటి నుండి నిన్ను శాశ్వతంగా బహిష్కరిస్తున్నా అని భవాని అంటుంది. మన ఇంటి కోడల్ని మనమే వెళ్ళగొడతామా? అక్కా ఇంత పెద్ద శిక్షా? అని రేవతి అనగా.. ఈ రోజు ఈ పిల్ల నా పెద్దరికాన్ని ప్రశ్నించింది. వెంటనే పెట్టాబేడా సర్దుకొని వెళ్ళమని భవాని చెప్తుంది. రెండు రోజుల టైం ఇవ్వండి. నేను ఏం తప్పు చేయలేదని నిరూపించుకొని వెళ్తాను అని భవానిని అడుగుతుంది కృష్ణ. మరి భవాని తన రిక్వెస్ట్ ని అంగీకరిస్తుందా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే!.