English | Telugu

ఓంకార్ షోలో కూతురితో కలిసి ప్ర‌త్య‌క్ష‌మైన బండ్ల గ‌ణేశ్‌!

ఓంకార్ ప్ర‌యోక్త‌గా స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతోన్న సిక్స్త్ సెన్స్ సీజన్ 4 కి టీవీ సెలెబ్రిటీలను గెస్ట్ లుగా తీసుకొస్తున్నారు. తాజాగా ఈ షోకి నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ వచ్చారు. ఎప్పటిలానే షోలోకి ఎంట్రీ ఇవ్వగానే.. ''వెంకటేశ్వర స్వామికి ఏం ఉత్సవాలు చేస్తారో.. డాలర్ శేషాద్రికి తెలియదా.. అలాగే పవర్ స్టార్ గురించి బండ్ల గణేష్‌కి తెలియదా.. ఆయన నా దేవర‌.. నా ఆస్తి.. నా సర్వస్వం.. ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.." అంటూ పవన్ క‌ల్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

అయితే ఈ షోకి బండ్ల గణేష్ తనతో పాటు తన కూతురు జననిని కూడా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తన కూతురు జనని కోరిన రెండు కోరికలను బయటపెట్టారు. తన కూతురు వయసు 18 ఏళ్లు అని.. ఈ 18 ఏళ్లలో తనను రెండే ప్రశ్నలు అడిగిందని చెప్పారు. "అందులో ఒకటి.. పవన్ కళ్యాణ్ తో మళ్లీ బ్లాక్‌బస్టర్ సినిమా ఎప్పుడు తీస్తావ్..? రెండోది.. ఓంకార్ అన్నయ్య షోకి వెళ్తే నన్ను కూడా తీసుకెళ్లు అని.. అందుకే నా కూతుర్ని షోకి తీసుకొచ్చా.. అదీ నీకున్న క్రెడిబిలిటీ.ష‌ అంటూ ఓంకార్ పై ప్రశంసలు కురిపించాడు బండ్ల గణేశ్‌.

ఈ మధ్యకాలంలో బండ్ల గణేశ్‌ తన స్పీచ్ లతో అదరగొడుతున్నాడు. ఆయన ఎక్కడ ఏం మాట్లాడినా సంచలనం అవుతోంది. ఇప్పుడు సిక్స్త్ సెన్స్ షోలో కూడా తన మార్క్ చూపించి అదరగొట్టాడు. తన కూతురుని మొదటిసారి ఆన్ స్క్రీన్ మీదకు తీసుకొచ్చి పరిచయం చేశారు. ఈ షోలో బండ్ల గ‌ణేశ్ ఇంకేం మాట్లాడారో చూడాలంటే వ‌చ్చే శ‌ని, ఆదివారాల్లో రాత్రి 9 గంట‌ల‌కు స్టార్ మాలో ప్ర‌సారం కానున్న ఎపిసోడ్ చూడాల్సిందే.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.