Read more!

English | Telugu

జోలపాట పాడి కూతురు కోసం సింగరైన బాలాదిత్య!

బాలాదిత్య ఎంత పెద్దవాడైనా ఇద్దరు పిల్లలకు తండ్రైనా కూడా ఇంకా బాలనటుడిగానే అందరికీ గుర్తొస్తాడు. బాలాదిత్య ఆల్ రౌండర్. బాలనటుడిగా సుమారు 40 సినిమాల్లో నటించాడు.  ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం’ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చాడు. తర్వాత ‘రౌడీగారి పెళ్ళాం’ ‘జంబలకిడి పంబ’ , అన్న, ‘ఆజ్ క గుండా రాజ్’ ‘హలో బ్రదర్’ ‘హిట్లర్’ ‘సమరసింహారెడ్డి’  లిటిల్ సోల్జర్స్ వంటి మూవీస్ లో  చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు. లిటిల్ సోల్జర్స్ మూవీకి నంది అవార్డు అందుకున్నాడు. 1940 లో ఒక గ్రామం అనే మూవీకి  నేషనల్ అవార్డును అందుకున్నాడు.

2003 లో ఇతను హీరోగా ‘చంటిగాడు’ అనే మూవీలో నటించాడు. రీసెంట్ గా " మా ఊరి పొలిమేర" అనే చిత్రంలో కూడా  నటించాడు. హీరోగా మంచి బ్రేక్ రాకపోయేసరికి ఫైనల్ గా సీరియల్ ఆర్టిస్ట్ గా సెటిలయ్యాడు.. సావిత్రమ్మ గారి కొడుకు, శాంభవి వంటి సీరియల్స్ తో తెలుగు ఆడియన్స్ ని మెప్పించాడు. తర్వాత బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. మంచి మార్క్స్ కూడా సంపాదించుకున్నాడు. హౌస్ నుంచి బయటకు వచ్చాక తన రెండో కూతురు యజ్ఞ విధాత్రి నామకరణ వేడుకను ఘనంగా నిర్వహించాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా ఈ ఫంక్షన్ కి వచ్చారు. 

ఇప్పుడు బాలాదిత్య తన కూతురు కోసం సింగర్ కూడా అయ్యాడు. "నా చిట్టిగాడే..నా తల్లిగాడే..నా చిట్టితల్లిగాడే...నా పుత్రి వీడే...విధాత్రి వీడే..యజ్ఞ విధాత్రి వీడే.." అంటూ ఒక చిన్న జోలపాటను క్రియేట్ చేసి పాడాడు. బాలాదిత్య పాడుతున్నంత సేపూ..తన కూతురు చాలా ఆసక్తిగా రెప్ప వాల్చకుండా వాళ్ళ నాన్న పెదాల కదలికలనే చూస్తూ ఉండిపోయింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ మాత్రం పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. పాట బాగుంది..పాపా బాగుంది..పేరు బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.