Read more!

English | Telugu

కూతురికి మందు బాటిల్ ని గిఫ్ట్ గా పంపిన నాన్న!

గిఫ్ట్ గా ఎవరైనా ఏమైనా ఇచ్చారంటే అది ఎంతో ఆనందం ఉంటుంది కదా ఎవరికైనా.. మరి అష్షుకి వాళ్ళ నాన్న ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలిస్తే మాత్రం భలే నవ్వొస్తుంది. పేరెంట్స్ మైండ్ సెట్ లో కూడా ఈమధ్య మార్పు కనిపిస్తోంది. చాలా బ్రాడ్ గా ఆలోచిస్తున్నారు. పిల్లలకు ఏది ఇష్టమో తెలుసుకుని సంకోచం లాంటివి లేకుండా గిఫ్ట్స్ ని షేర్ చేసుకుంటున్నారు. ఇంతకు అష్షుకి వాళ్ళ నాన్న ఏం పంపించారో తెలుసా.. మందు బాటిల్ గిఫ్ట్ గా ఇచ్చారు. మందు బాటిల్ అంటే మెడిసిన్ కాదు అందరూ తాగే మందే... తనకు ఈ మద్యం బాటిల్ గిఫ్ట్ గా పంపించడంపై అష్షు తెగ మురిసిపోయింది. "థ్యాంక్యూ సో మచ్ డాడీ...ఐతే మీరు పంపించిన ఈ గిఫ్ట్ మాత్రం అమ్మకు ఎంత మాత్రం నచ్చలేదు" అని రాసి స్మైలీ  ఎమోజి కూడా పెట్టింది. దీన్ని బట్టి అర్ధమవుతోంది అష్షు డాడీ కూచి అని తనకు ఏది ఇష్టమో వాళ్ళ నాన్న అదే ఇస్తాడని. అమ్మడు మాత్రం చాలా డేరింగ్ అండ్ డాషింగ్ గా వాళ్ళ నాన్న ప్రెజంట్ చేసిన గిఫ్ట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇలాంటి గిఫ్ట్స్ ని పేరెంట్స్ అసలు ఇస్తారా అంటూ నెటిజన్స్ అష్షు ఫాన్స్ అడుగుతున్నారు. 

టిక్ టాక్ ద్వారా సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిన అష్షు రెడ్డికి బీభత్సమైన ఫాన్స్ ఉన్నారు. ఆర్జీవీ ఇంటర్వ్యూతో ఫుల్ ఫేమస్ అయ్యింది. డబ్ స్మాష్ వీడియోస్ తో ఇంకా ఫేమస్ అయ్యింది ఈ హాట్ బ్యూటీ. తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి.. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో నడిపిన ప్రేమాయణంతో అప్పట్లో ఫుల్ ట్రెండింగ్ లో ఉండేది అష్షు. అంతే కాదు అమ్మడుకి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అని చెప్పడానికి టాటూ వేయించుకుని ఆ హాట్ ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఇన్స్టానే బ్రేక్ చేసింది. బుల్లితెర షోలతో  అదరగొడుతూనే.. సోషల్ మీడియాలో తన పిక్స్ తో హల్ చల్ చేస్తూ..మూవీస్ లో అడుగుటపెట్టింది.