English | Telugu

ఏపీ రాజధానిపై వ్యాఖ్యలు.. వివాదంలో యాంకర్ ప్రదీప్

యాంకర్‌ ప్రదీప్‌‌ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ టీవీ షోలో ఏపీ రాజధాని విశాఖ అంటూ ప్రదీప్‌ వ్యాఖ్యలు చేశాడు. దీంతో ప్రదీప్‌ పై ఏపీ పరిరక్షణ సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో ఉన్న అంశాలపై యాంకర్ ప్రదీప్‌ ఎలా మాట్లాడతారని.. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని ఏపీ పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది.

ఈ వివాదంపై ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్‌ కొలికలపూడి శ్రీనివాసరావు స్పందిస్తూ ప్రదీప్‌ ను తీవ్రంగా హెచ్చరించారు. కోర్టులో ఉన్న అంశాలపై ప్రదీప్‌ ఎలా వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించారు. రైతులు, ప్రజల మనోభావాలు కించపరిచేలా వ్యవహరిస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రదీప్‌ తను చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోని.. క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. క్షమాపణ చెప్పకుంటే ప్రదీప్‌ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.

కాగా, ఎందరో మనోభావాలతో ముడిపడి ఉన్న రాజధాని వంటి సున్నిత అంశంపై వ్యాఖ్యలు చేసిన ప్రదీప్.. ఏపీ పరిరక్షణ సమితి హెచ్చరికల నేపథ్యంలో క్షమాపణలు చెబుతారేమో చూడాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.