Read more!

English | Telugu

అమర్ దీప్ కెపాసిటీ సూపర్.. నైట్ అయితే...

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈ ఆదివారం ఫుల్ ఛిల్ చేసింది. అసలు హాట్ సమ్మర్ లో కూల్ గా గేమ్స్ ఆడించడమే కాదు రంగు రంగుల గోలీ సోడాల పోటీ కూడా పెట్టింది. ఇందులో అమర్ దీప్ చౌదరి టీమ్ వెర్సెస్ అంబటి అర్జున్ మధ్య ఈ పోటీ పెట్టింది శ్రీముఖి. ఐతే చెరో పది గోలి సోడాల్ని కొట్టుకుని తాగారు ఇద్దరూ. ఐతే అంబటి అర్జున్ అన్ని తాగేసి టాస్క్ పూర్తిచేసాడు. కానీ అమర్ దీప్ మాత్రం రెండు రెండు సోడాల్ని తాగినా గ్యాస్ కారణంగా ఎక్కువగా తాగలేక టాస్క్ కంప్లీట్ చేయలేకపోయాడు. ఇక ఈ టాస్క్ లో అంబటి అర్జున్ గెలిచాడు. 

"ఇదే టాస్క్ బిగ్ బాస్ హౌస్ లో ఇచ్చి ఉంటే వదిలి పెట్టేవాడివా" అని శ్రీముఖి అడిగింది. "ఆయన సంచి పెద్దది..నా సంచి చిన్నది" అని అమర్ అనేసరికి "సంచితో సంబంధం లేదు" అని చెప్పాడు అర్జున్. "నిజం చెప్పాలంటే ఈ టాస్క్ లో నేను గెలుస్తాను అనుకోలేదు..ఎందుకంటే సాయంత్రం పూట అమర్ దీప్ కెపాసిటీతో పోల్చుకుంటే నేను తాగింది చాలా తక్కువే. ఈ సోడాలో వేరేవి కలపకపోవడం వల్లనే అమర్ దీప్ ఓడిపోయాడు" అని చెప్పాడు. "అవునురా అమర్ ఈ టాస్క్ రాత్రి పూట పెడితే గెలిచేవాడివి కదా" అని శ్రీముఖి అడిగింది. "నిజమే అంబటి అర్జున్ కి ఇచ్చిన ఆ పది సోడాలు కూడా అమర్ దీప్ తాగేసేవాడు" అని చెప్పాడు టేస్టీ తేజా. 

తర్వాత లేడీస్ రౌండ్ వచ్చింది. ఇందులో పూజ వెర్సెస్ శుభశ్రీ రాయగురుకి  ఐదు గోలీ సోడాలు ఇచ్చింది శ్రీముఖి. ఈ టాస్క్ లో పూజ గెలిచింది. ఇక రెండు గ్రూప్స్ కి టై అయ్యేసరికి ఫైనల్ గా  టేస్టీ తేజ వెర్సెస్ గౌతమ్ కృష్ణకి మధ్య ఇదే టాస్క్ ఇచ్చింది. గెలిచిన వాళ్ళు సుబ్బుతో డేటింగ్ కి వెళ్లొచ్చనే ఆఫర్ కూడా ఇచ్చింది. ఫైనల్ గా గౌతం కృష్ణ గెలిచాడు.