Read more!

English | Telugu

స్టెరాయిడ్స్ వాడలేదు..నా కండలు నేచురల్

ప్రపంచంలో 64 కళలు ఉన్నాయి..అందులో కండల్ని పెంచడం కూడా ఒక కళ..  సిక్స్ ప్యాక్ పెంచడం అంటే మాటలు కాదు. కుర్రాళ్లంతా కండలు పెంచడం కోసం జిమ్ లో తెగ కసరత్తులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్లు కూడా జిమ్ములకు వెళ్లి ఆరోగ్యాన్ని పెంచుకుంటున్నారు. ఇక అఖిల్ సార్థక్  గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కువశాతం జిమ్ లోనే ఉంటాడు. అతనికి దైవ భక్తి కూడా ఎక్కువే...ఐతే జిమ్ లో ఉంటాడు లేదా భగవద్దర్శనం కోసం రకరకాల ప్రాంతాలకు వెళ్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు రీసెంట్ గా జిమ్ లో తన కండల్ని చూపిస్తూ వీడియోని అప్లోడ్ చేసాడు. ఐతే కొంతమంది త్వరగా పెరిగిపోవడం కోసం ఎక్కువగా స్టెరాయిడ్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని అఖిల్ ఇన్డైరెక్ట్ గా చెప్పాడు.

అంటే తన కండల్ని చూసి అందరూ ఎక్కడ ఆర్గానిక్ గా పెంచిన కండలు కాదు అనుకుంటారేమో అని "నో స్టెరాయిడ్స్ ఓన్లీ నేచురల్ భాయ్" అంటూ ఒక లైన్ ని ట్యాగ్ చేసాడు. ఎందుకంటే ఇప్పుడు పాజిటివ్ గా నెగటివ్ గా తీసుకునే వాళ్ళే ఎక్కువైపోయారు కాబట్టి అఖిల్ ముందు జాగ్రత్తతో ఈ కామెంట్ ని పెట్టేసాడు. అఖిల్ పోస్ట్ చేసిన వీడియోకి ముమైత్ ఖాన్ కూడా రెస్పాండ్ అయ్యింది "ఎస్ మై దేశీ మ్యాన్" అని మెసేజ్ చేసాడు. ఇక మిగతా నెటిజన్స్ ఐతే "ఎవరైనా చెప్పారా మీరు స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారని" అని అడిగాడు. ఇక అఖిల్ సార్థక్ అంటే చాలు  బిగ్ బాస్ హౌస్ మేట్ గానే గుర్తొస్తాడు. బిగ్ బాస్ సీజన్ 4లో అఖిల్ సార్థక్ పార్టిసిపేట్ చేశారు. బిగ్ బాస్ షోతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. హౌస్ లో హీరోయిన్ మోనాల్ గజ్జర్ తో లవ్ స్టోరీ నడిపాడు కానీ మోనాల్ మాత్రం పట్టించుకోలేదు.