Read more!

English | Telugu

శ్రీహన్ గుర్తొచ్చినప్పుడల్లా తన షర్ట్ మీద కిస్ చేసేదాన్ని

బుల్లితెర లవ్ జోడి శ్రీహాన్- సిరి హనుమంతు గురించి అందరికీ తెలుసు. బిగ్ బాస్ తెలుగు సీజన్-5 లో సిరి హనుమంతు -యూట్యూబర్ షణ్ముఖ్ మధ్య క్లోజ్ నెస్ వల్ల అప్పట్లో నెటిజన్స్ సిరిని ఫుల్ గా ట్రోల్ చేసి పడేసారు. హౌస్ నుంచి బయటకు వచ్చాక శ్రీహాన్-సిరి మధ్య కొన్ని రోజులు మాటలు లేవు కానీ తర్వాత వాళ్లిద్దరూ కలిసిపోయి అన్ని ప్రోగ్రామ్స్ లో కనిపిస్తున్నారు. కానీ అక్కడ మాత్రం షన్ను - దీప్తి మధ్య అప్పుడు మొదలైన దూరం ఇప్పటికీ అలా కంటిన్యూ అవుతూనే ఉంది.  

ఐతే ఇప్పుడు ఫిబ్రవరి 14 న వాలెంటైన్స్ డే వస్తున్న సందర్భంగా స్టార్ మాలో "లవ్ టుడే" అనే ఒక స్పెషల్ ప్రోగ్రాం రాబోతోంది. దాని ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.  ఈ కార్యక్రమానికి శ్రీహాన్ తన ప్రేయసి సిరి హనుమంతుతో కలసి వచ్చాడు.  ‘బిగ్ బాస్’లో జరిగిన ఘటనలను తలచుకుని బాధ పడింది సిరి. శ్రీహన్  ఎప్పుడూ యూనిక్ గా ఉంటాడు కాబట్టి సిరి గోల్డ్ రోజ్ ఇచ్చి ప్రొపోజ్ చేసింది. శ్రీహాన్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు చాలా మిస్ ఐనట్లు, తాను గుర్తొచ్చినప్పుడల్లా తన దగ్గర ఉన్న శ్రీహాన్ షర్ట్ పైన కిస్ చేస్తూ ఉండేదాన్నని చెప్పుకొచ్చింది. జీవితంలో చిన్న చిన్న తప్పులు ఎవరైనా చేస్తారని,  కానీ స్టేజి మీద వాటిని ఎవరూ ఒప్పుకోరు అని తనకు  తెలియకుండానే ఏదైనా తప్పు చేశానేమో అని కన్నీరు పెట్టుకొనేసరికి సిరిని శ్రీహాన్ దగ్గరకు తీసుకొని ఓదార్చాడు.