Read more!

English | Telugu

ఇంద్రజకి జనాల మధ్యలో సింపుల్ గా ఉంటేనే ఇష్టమట!

సీనియర్ నటి ఇంద్రజ గురించి ప్రతేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ అందరూ లగ్జరీ లైఫ్ ని కావాలనుకుంటారు. స్టార్ డమ్ తో జీవిస్తుంటారు. చుట్టూ ఎప్పుడు బౌన్సర్ ల మధ్యలో ఫుల్ సెక్యూర్ గా ఉంటారు. కానీ వారందరికి భిన్నంగా ఇంద్రజ ఉంటోంది.

ఇంద్రజ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి బిజీ బిజీగా గడుపుతుంది. ఒకవైపు 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కి జడ్జ్ గా, మరోవైపు 'జబర్దస్త్' కి జడ్జ్ గా వ్యవహరిస్తూ.. మంచి కామెడీ టైమింగ్ తో పంచులు వేసి నవ్విస్తుంది. అంతే కాకుండా ఇటీవల చేసిన తన డ్యాన్స్ వైరల్ కావడంతో ఒక్కసారిగా మరింత పాపులర్ అయింది ఇంద్రజ. 'దసరా' మూవీలోని తీన్మార్ డాన్స్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలుసిన విషయమే. ఆ తీన్మార్ పాటకి ఇంద్రజ చేసిన డ్యాన్స్ స్టెప్పులు బుల్లితెర టీవీ ప్రేక్షకులని ఫిదా చేసాయంటే అతిశయోక్తి కాదు. బుల్లితెరతో పాటుగా సోషల్  మీడియాలో కూడా ఇంద్రజ డ్యాన్స్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. దాంతో ఇంద్రజలోని మరొక టాలెంట్ బయటకు వచ్చింది. మరింతగా క్రేజ్ పెరిగింది. మొదటి నుండి ఇంద్రజ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ తన‌ ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో పోస్ట్ చేస్తూ.. తన ఫాన్స్ కి దగ్గరగా ఉంటూ వస్తుంది.

అయితే ఇంద్రజ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియోని పోస్ట్ చేసింది. అందులో రామాలయం టెంపుల్ ని చూపిస్తూ.. నాకు టైం దొరికినప్పుడు ఇక్కడికి వస్తాను.. అదీ నడుచుకుంటూ వస్తానని ఇంద్రజ ఆ వీడియోలో చెప్పింది. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సాధారణంగా వచ్చేసింది ఇంద్రజ. మరొక వీడియోలో  ఇంద్రజ నడిచి వెళ్తున్న వీడియో ఉంది. నాకు ఇలా వాకింగ్ చేస్తూ ఉంటే సరదాగా ఉంటుంది.. నాకు ఇలా జనాల మధ్యలో ఒక జనం లాగా కలిసిపోయి తిరుగుతుంటే.. ఆ ఫీల్ అనేది డిఫరెంట్ గా ఉంటుందని ఆ వీడియోలో చెప్తూ పోస్ట్ చేసింది ఇంద్రజ. దీంతో ఈ పోస్ట్ చూసిన తన అభిమానులు ఇంత సింపుల్ గా ఉంటారేంటి మేడం అని అనుకుంటున్నారు. కాగా ఇంద్రజ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.