English | Telugu

బిగ్ బాస్ ప్రోమోలు చేసేది ఆ వెబ్ సిరీస్ డైరెక్టరా!

 

ఇదేందయ్యా ఇది.. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొదలవుతుండగా దానికి సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

బిగ్ బాస్ హౌస్ లో జరిగేది ఒకటైతే.. బయట మనకి టీవీలో చూపించేది మరొకటి. అందులోను టీవీ చూసే అభిమానులని ఆకట్టుకునే ప్రోమో చేయడమంటే కత్తి మీద సామే. హౌస్ లో జరిగే ఆటలో పెద్ద విషయం లేకపోయిన ప్రోమోలతోనే హైప్ ఇచ్చేస్తుంటారు బిబి టీమ్. ఈరోజు బిగ్ బాస్ చూడాల్సిందే అనేట్టు చేసేవి కూడా ఈ ప్రోమోలే. ప్రోమో చూసిన తరువాత ఏమైనా కట్ చేశాడా ఎడిటర్ మామ అంటూ బోలెడన్ని జోక్‌లు వేసుకుంటారు. ప్రతి ప్రోమో కింది ఎడిటర్ మామ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఈ బిగ్ బాస్ ప్రోమోలను రూపొందించే వ్యక్తి ఎవరో తెలిసిపోయింది. అతనే దర్శకుడు ముఖేష్ ప్రజాపతి(Mukesh Prajapati ) . తాజాగా ప్రముఖ ఓటీటీ వేదిక జీ 5 లో అంజలి ప్రధాన పాత్ర పోషించిన ' బహిష్కరణ ' వెబ్ సిరీస్ రిలీజైన విషయం తెలిసిందే. ఈ సిరీస్ దర్శకుడే ముఖేష్ ప్రజాపతి. 

బహిష్కరణ ప్రెస్ మీట్ లో భాగంగా కొంతమంది సెలెబ్రిటీలు వచ్చారు. వారిలో సోహైల్ దర్శకుడి గురించి నిజాలు బయటపెట్టేశాడు. ముఖేష్ అన్న.. బిగ్ బాస్‌లో మా ప్రోమోలు, Avలు చేసేవాడు. చాలా హ్యాపీగా ఉంది. బుల్లితెర నుంచి ఎవరైనా యాక్టర్ అయిన డైరెక్టర్ అయిన చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ సినిమా ట్రైలర్ చూడగానే ముఖేష్ అన్నని నాతో సినిమా చేయమని అడిగాను. నాకు హిట్ కావాలి.. డైరెక్ట్ చేస్తావా? అని అడిగాను. కానీ ముఖేష్ అన్న వేరే ప్రాజెక్ట్ ఏదో చేస్తా అన్నాడు. బహిష్కరణ ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తరువాత దీనమ్మా జీవితం ఇలాంటి డైరెక్టర్ పడాల్రా అని అనుకున్నానంటు సోహైల్ చెప్పుకొచ్చాడు. సోహైల్ స్పీచ్‌ని బట్టి బిగ్ బాస్ ప్రోమోలను అంత రసవత్తరంగా కట్ చేసేది ముఖేష్ ప్రజాపతి అని విషయం బయటకు వచ్చింది. మరి బిగ్ బాస్ ప్రోమోలు ఎడిట్ చేసే మన ఎడిటర్ మావ ముఖేష్ ప్రజాపతికి ఓ లైక్ వేస్కోండి.