Read more!

English | Telugu

నటుడు నందు కాలికి గాయం...గెట్ వెల్ సూన్ అంటున్న నెటిజన్స్

నటుడు నందు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గీత మాధురి భర్తగా అందరికీ సుపరిచితుడే. ఆయన గాయపడి కాలికి పెద్ద కట్టు కట్టించుకుని ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాలికి గాయమై నడవలేని స్థితిలో ఉన్నా డబ్బింగ్ చెప్పడానికి  స్టూడియోకి వచ్చాడు నందు. అక్కడ కాలు చాపుకుని కూర్చున్న ఫోటో ఒకటి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. కానీ అసలు ఏం జరిగింది అన్న విషయం మాత్రం రివీల్ చేయలేదు. నందు ప్రస్తుతం  సినిమాలు, క్రికెట్ కామెంటరీస్ చెప్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. "ఫోటో" అనే మూవీతో ఎంట్రీ ఇచ్చిన నందు తర్వాత ఎన్నో మూవీస్ లో నటించాడు. 

100 పర్సంట్ లవ్, ఆటోనగర్ సూర్య , పెళ్లి చూపులు, జయ జానకి నాయక, రాజుగారి గది2, సమ్మోహనం, సవారీ వంటి సినిమాల్లో నటించాడు. లాస్ట్ ఇయర్  "బొమ్మ బ్లాక్ బస్టర్" అనే మూవీ చేసాడు కానీ అది ఓ మోస్తరుగా మాత్రమే ఆడింది. అయితే ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 28 తో పాటు ఆర్‌సి 15, డిజే టిల్లు 2, హరిహరమల్లు, ధాస్ కీ ధమ్కీ సినిమాలతో నటిస్తున్నారని తెలుస్తుంది. కాలికి గాయం ఐనా కూడా నాలుగు రోజుల క్రితం జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఒక వీడియో కూడా పోస్ట్ చేసాడు. "మీ అందరికీ చాలా థ్యాంక్స్ నా వాచ్ చేస్తూ నా గురించి ఆలోచిస్తున్నందుకు" అని కాప్షన్ పెట్టాడు. ఇక నెటిజన్స్ కూడా "గెట్ వెల్ సూన్, యువర్ ఆర్ రాక్ స్టార్, టేక్ కేర్" అని కామెంట్స్ పెట్టారు.  


శరీరంలో వస్తున్న మార్పులకు కారణం థైరాయిడ్ కావచ్చు.శరీరం లోని హార్మోన్ల లోపం వల్ల వచ్చే సంకేతంగా చెప్పవచ్చు. థైరాయిడ్ సమస్య ముఖ్యంగా స్త్రీల పైనే తీవ్ర ప్రభావం చూపిస్తుంది.నేడు స్త్రీలు ఎదుర్కుంటున్న అనారోగ్య సమస్యలలో బిపి,డయాబెటిస్,లాంటి సాధారణ సమస్యలతోపాటు,ఇంఫెర్టిలిటి,సంతాన లేమి సమస్య లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఊబకాయం,లేదా ఇతర అనారోగ్య సమస్యలు వారిని వేదిస్తున్నాయి.