English | Telugu

లేడీ గెటప్ ఎంత కష్టమో చెప్పిన రాకింగ్ రాకేష్!

టీవీ రంగంలో జబర్దస్త్ షో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో అందరికి తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన విషయం తెలిసిందే. గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, వేణు ఎల్దండి, అటో రాంప్రసాద్, చమ్మక్ చంద్ర, శకలక శంకర్ ఇలా చాలామంది జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయి ఇండస్ట్రీకి వచ్చి మంచి అవకాశాలను పొందుతున్నారు. అదే బాటలో రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత కూడా ఫేమస్ అయ్యారు.

జోర్దర్ సుజాత తనకంటు సొంతంగా ' సూపర్ సుజాత' అనే యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి అందులో రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తుంది. కాగా ఆ వ్లాగ్స్ అన్నీ అత్యధిక వీక్షకాధరణ పొందుతున్నాయి. రాకింగ్ రాకేష్ జబర్దస్త్ లో మొదటి నుండి పిల్లలతో ఎక్కువగా స్కిట్లు చేస్తూ ఆకట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత వీళ్ళ టీమ్ లోకి జోర్దార్ సుజాత వచ్చింది. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి వివాహం చేసుకున్నారు. రాకింగ్ రాకేష్ సొంతంగా ' చంటబ్బాయ్' అనే యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేశాడు. అందులో వీళ్ళిద్దరు కలిసి అమెరికా, యూకే వెళ్తున్న వ్లాగ్స్ చేశారు. అవి తాజాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. పాస్ పోర్ట్స్ పోయాంటూ సుజాత మీద ఫ్రాంక్ చేసిన వ్లాగ్ ఫుల్ వైరల్ అయింది. అయితే తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో ' లేడీ గెటప్ ఎంత కష్టమంటే' అనే వ్లాగ్ ని అప్లోడ్ చేశాడు రాకింగ్ రాకేష్.

ఈ వ్లాగ్ లో తను జబర్దస్త్ లో ఎదర్కున్న కొన్ని ప్రాబ్లమ్స్ గురించి రాకేష్ చెప్పాడు. మా స్కిట్ లో లేడీ గెటప్స్ వల్లనే మేం పర్ఫామెన్స్ ఫ్రీగా చేయగలుగుతున్నామని రాకేష్ చెప్పాడు. ఈ వ్లాగ్ లో జబర్దస్త్ లో లేడీ గెటప్ లు వేస్తున్న వినోదిని, శాంతి స్వరూప్ కూడా ఈ లేడీ గెటప్ కోసం ఎంత కష్టపాడుతున్నారో చెప్పారు. రాకింగ్ రాకేష్ జబర్దస్త్ కి వచ్చిన మొదట్లో లేడీ గెటప్ లు వేసిన వీడీయోలు ఈ మధ్య యూట్యూబ్ లో వైరల్ అయ్యాయి. వాటిని దృష్ణిలో పెట్టుకొని తాజాగా జబర్దస్త్ లో చేస్తున్న స్కిట్ లో తన భార్య సుజాత మగవాడి గెటప్ లో, రాకేష్ ఆడవారి గెటప్ లో కన్పిస్తున్నట్టుగా ఈ వ్లాగ్ లో వివరించాడు రాకేష్. కాగా ఈ లేడీ గెటప్ ల గురించి ఎప్పటినుండో వ్లాగ్ చేద్దామని ఇప్పటికి చేయడానికి కుదరిందని మాకు సపోర్ట్ చేయండంటూ అందరికి థాంక్స్ చెప్పాడు రాకేష్.