Read more!

English | Telugu

వసుధార మెడలో తాళి కట్టిందెవరు?


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'గుప్పెడంత మనసు' సీరియల్ -677 లోకి అడుగుపెట్టింది. కాగా శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో .. వసుధారని వెతుక్కుంటూ కాలేజ్ కి వస్తాడు రాజీవ్. అక్కడ జగతి, మహేంద్రలతో నా భార్య వసుధార ఎక్కడ అంటూ అడుగుతాడు. మీ పర్సనల్ విషయాలు‌ ఇక్కడ మాడ్లాడకు.. ఇక్కడ కాన్ఫరెన్స్ జరుగుతుంది. మీ ఇంటికెళ్ళి చూసుకోమని మహేంద్ర చెప్తాడు. మీ కాన్ఫరెన్స్ లోకి వస్తేనే మీరు ఇలా అంటున్నారు. మరి నా కాపురంలోకి వస్తే నేనేం అనాలని రాజీవ్ అంటాడు. ఆ తర్వాత కాసేపు అలాగే వాగ్వాదం జరిగాక వసుధారని వెతుక్కుంటూ తన క్యాబిన్ దగ్గరుకు వెళ్తాడు. అక్కడ వసుధార వచ్చి.. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావ్ బయటకెళ్ళు అని అంటుంది. ఇది బాగానే ఉంది. ఒక భార్య..‌ ఒక భర్త.. ఒక తగాదా.. ఈ మాత్రానికే భర్తను వెళ్ళిపోమాంటావా అని రాజీవ్ అడుగుతాడు. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను.. వెళ్ళిపోమని వసుధార చెప్తుంది.

అలా కాసేపటికి వసుధారని బలవంతంగా తీసుకెళ్తుండగా రిషి అక్కడికి వస్తాడు. ఏంటి వసుధార ఏం జరుగుతుంది అని అడుగుతాడు. సర్.. నేను రానని చెప్పినా బలవంతంగా తీసుకెళ్తున్నాడని వసుధార చెప్తుంది. నేను నా భార్యని తీసుకెళ్తున్నాని రాజీవ్ చెప్తాడు. నేను రానని వసుధార అంటుంది. అలా కాసేపు ఇద్దరికి గొడవ జరుగుతుంది. ఇక రాజీవ్ వసుధార చేతిని పట్టుకోబోతుండగా రిషి అడ్డుపడతాడు. "ఏంటి రిషీ సర్.. ఈ ట్విస్ట్" అని రాజీవ్ అనగా.. "అసలు ట్విస్ట్ నేను కాదు వాళ్ళు ఇస్తారు అటు చూడు" అని పోలీసుల వైపు తోసేస్తాడు. దీంతో రాజీవ్ షాక్ అవుతాడు. నేనేదో నా భార్యని తీసుకెళ్తుంటే ఇలా చేస్తున్నారు సర్ అని రాజీవ్ చెప్పగా.. "తాళి కట్టకుండా ఎలా తను‌ నీ భార్య అవుతుంది రా" అని SI రాజీవ్ కాలర్ పట్టుకొని అంటాడు. ఇక రాజీవ్ దగ్గర సమాధానం లేక మౌనంగా ఉండిపోతాడు. ఆ తర్వాత రాజీవ్ ని  పోలీసులు తీసుకెళ్తారు.

రిషి, వసుధార దగ్గరకి వెళ్ళి... "ఏంటి వసుధార ఇది.. ఇన్నాళ్ళు రాజీవ్ తాళి కట్టాడని అనుకున్నా కానీ ఇప్పుడు కాదని తెలిసింది. ఎవరిని మోసం చేస్తున్నావ్? నన్ను మోసం చేస్తున్నావా లేక నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావా... నాకు ఏం అర్థం కావట్లేదు" అని అడుగుతాడు. నన్ను అర్థం చేసుకున్నానని అన్నారు కదా.. ఇదేనా మీరు అర్థం చేసుకుంది. వీలైతే నా మెడలో తాళి ఎవరు కట్టారో తెలుసుకోడానికి ప్రయత్నించండని వసుధార చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జగతి, మహేంద్రలు కలిసి "వసుధార ఏంటి ఇలా చేసింది. అసలు ఎవరిని పెళ్ళి చేసుకుంది" అని మాట్లాడుకుంటారు. అసలు నిజమేంటో తెలియాలంటే వసుధారనే అడగాలి అని ఇద్దరు నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.