Read more!

English | Telugu

ఆ అమ్మాయి ఎవరైనా.. బ్యాక్ గ్రౌండ్ ఏదైనా నేను మీ పెళ్ళి చేస్తాను!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -127 లో.. కృష్ణ, మురారి ఇద్దరు రెస్టారెంట్ లో మాట్లాడుకుంటారు. కూల్ డ్రింక్ ఎక్స్ ట్రా ఆర్డర్ చేసిన కృష్ణ.. ఇక్కడికి ఇంకొకరు వస్తున్నారని మురారికి చెప్తుంది. ఇంతలోనే గౌతమ్ అక్కడికి వస్తాడు. సర్ మీరు ఇద్దరు మేజర్ లకు పెళ్లి చేస్తానని మాట ఇచ్చారు కదా.. ఇదిగో గౌతమే ఆ అబ్బాయని, ఒక అమ్మాయిని ఈ గౌతమ్ ఇష్టపడ్డాడని కృష్ణ చెప్తుంది . అవునా ఆ అమ్మాయి ఎవరైనా సరే.. బ్యాక్ గ్రౌండ్ ఏదైనా సరే.. నేను మీ ఇద్దరి పెళ్ళి చేస్తానని మురారి అంటాడు. ఆ అమ్మాయి నందు అని తెలిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో ఏమో అని కృష్ణ తన మనసులో అనుకుంటుంది. వెంటనే వెయిటర్ ని పిలిచి క్యాలెండర్ ని తీసుకురమ్మని మంచి రోజు చూస్తాడు మురారి. ఈ అదివారం మంచి ముహూర్తం ఉంది. మీ పెళ్లి కచ్చితంగా చేస్తానని గౌతమ్ తో మురారి చెప్తాడు.

మరోవైపు నందుని పెళ్ళి చేసుకునే అబ్బాయి వాళ్ళతో భవాని మాట్లాడుతుంది. మా నందుకి చాలా ఆస్తులు కొని పెట్టాను.. నందుకి మతిస్థిమితం లేదు కాబట్టి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. పెళ్లి సింపుల్ గా చేద్దాం.. తర్వాత అమెరికా నుండి వచ్చాక రిసెప్షన్ గ్రాండ్ గా చేద్దామని భవాని అంటుంది. అప్పుడు అబ్బాయి వాళ్ళు కూడా సరే అంటారు. ఆ తర్వాత భవాని, ఈశ్వర్, ప్రసాద్ లు అందరూ కలిసి నందు పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. ఇంతలోనే రేవతి కాఫీ తీసుకోని వాళ్ళకి దగ్గరగా రావడం గమనించి.. వాళ్ళు మాట్లాడుకునే టాపిక్ డైవర్ట్ చేసి వేరే మాట్లాడతారు. తను రావడం తోనే టాపిక్ మార్చారని రేవతికి అర్థమవుతుంది. నేను ఈ ఇంటి కోడలినే కదా.. ఎందుకు నన్ను వేరు చేస్తున్నారు.. మీరు కృష్ణకి ఏదైనా నష్టం చేయాలని చూస్తే నేను మాత్రం ఊరుకోనని రేవతి అంటుంది. మేము కృష్ణ కి ఏం నష్టం చేయట్లేదని ఈశ్వర్ అంటాడు.

ఆ తర్వాత మురారి కోసం ముకుంద ఎదురు చూస్తుంటుంది. ఇంతలోనే మురారి అక్కడికి వస్తాడు. నందు పెళ్ళి బాధ్యత భవాని అత్తయ్య మనకు అప్పగించిందని, పెళ్ళి ఆదివారం ఫిక్స్ అయిందని ముకుంద అనగానే.. గౌతమ్ పెళ్ళి ఆదివారం.. ఈ పెళ్ళి ఆదివారం.. నాకు ఇదొక పెద్ద టాస్క్ అని మురారి అనుకుంటాడు. ఇక పెళ్ళి పనులు చాలా ఉన్నాయి.. వెళదాం పదా అని మురారితో ముకుంద అంటుంది. ఇద్దరు బయటకు బయలుదేరతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.