Read more!

English | Telugu

కృష్ణని బ్యాడ్ చేయడానికి ముకుంద వేసిన ఎత్తుగడ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'.. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -91లో.. మురారి ఉన్న గదిలోకి ముకుంద కాఫీ తీసుకొని వస్తుంది. అది చూసిన మురారి.. "నువ్వేంటి కాఫీ ఇక్కడికి తీసుకొచ్చావ్? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు" అని అడుగుతాడు. అలా తను అనగానే.. నాకు నీకు ఇలా ప్రేమగా తీసుకొచ్చి ఇవ్వడమే కావాలని ముకుంద అంటుంది. ఇంతలోనే కృష్ణ వాష్ రూమ్ నుండి బయటికొచ్చి.. "ఏంటీ ముకుంద నువ్వు కాఫీ తీసుకొచ్చావ్" అని అడుగుతుంది. చిన్న అత్తయ్యకి తలనొప్పిగా ఉందని పడుకుంది.. అందుకే నేను తీసుకొచ్చానని ముకుంద అంటుంది.  మీరు రెడీ అయి కిందకి వచ్చేయండని చెప్పి ముకుంద అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత ముకుంద వంటగదిలో వంట చేస్తూ తనలో తానే మాట్లాడుకుంటుంది.. "ఎలాగైనా కృష్ణని అందరి ముందు బ్యాడ్ చెయ్యాలి" అని ముకుంద అనుకుంటుంది. అప్పుడే కృష్ణ, మురారిలు కిందకి వస్తారు. "అత్తయ్యకి బాలేదు కదా?  నేను ఏమైనా హెల్ప్ చేయాలా ముకుంద" అని కృష్ణ అడుగుతుంది. నువ్వు కాలేజీకి రెడీ అయ్యావ్ కదా..ఎందుకులే.. నేను చూసుకుంటామని చెప్పి.. ఇదిగో నీ లంచ్ బాక్స్ అని ఇస్తుంది ముకుంద. కాసేపటికి కృష్ణ, మురారిలు కాలేజీకి వెళ్తారు. ఇక వంటగదిలో ఉన్న ముకుంద.. "ఇప్పుడే బ్రేక్ ఫాస్ట్ రెడీ చెయ్యను.. పెద్ద అత్తయ్య వచ్చే ముందు స్టార్ట్ చేసి కృష్ణ బాక్స్ తీసుకుని వెళ్ళిపోయింది" అని చెప్పాలనుకుంటుంది. ఇంతలోనే డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన భవాని.. "ఏంటి బ్రేక్ ఫాస్ట్ రెడీ చెయ్యలేదా? టేబుల్ మీద ఏం లేవు" అని అడుగుతుంది. ఇంకా రెడీ చెయ్యలేదు అత్తయ్య.. రేవతి అత్తయ్యకి బాగోలేదు. తను పడుకుంది. కృష్ణకి బాక్స్ రెడీ చేసి పంపించేసరికి నాకు ఈ టైం అయిందని ముకుంద అంటుంది. అలా తను అనడంతో.. "ఏంటి కృష్ణ తన పని కూడా తాను చేసుకోవట్లేదా? ఇంట్లో పనులు అందరూ సమానంగా చెయ్యాలి కదా" అని భవానీ అంటుంది.

మరోవైపు కాలేజీకి వెళ్తున్న కృష్ణకి.. కాలేజీలో ఎలా ఉండాలో చెప్తుంటాడు. "ఇన్ని రోజులు ఇంట్లో నుండి బయటికి వెళ్ళలేదు.. ఇంట్లో ఉన్నట్లుగా కాకుండా, అందరితో బాగుండాలి" అని మురారి చెప్తాడు. "మీరు చెప్పే గోల్డెన్ వర్డ్స్ నేను మర్చిపోను సర్" అని చెప్పేసి కృష్ణ కాలేజీలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.