Read more!

English | Telugu

Krishna Mukunda Murari : ఆదర్శ్ మనసుని మార్చేసిన మీరా.. అన్నదమ్ములిద్దరు కలిసారు కదా!

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్- 440 లో.. మురారి, కృష్ణల దగ్గరికెళ్ళి ఆదర్శ్ బ్యాగ్ తీసుకొని లోపలికి వచ్చేస్తాడు. దాంతో మురారి, కృష్ణ వారి గదిలోకి వెళ్తారు. కాసేపటికి కృష్ణ గదికి మీరా వెళ్తుంది. దీని ముఖం చూడటానికి నాకు అసహ్యంగా ఉంది. కానీ తప్పదని మనసులో అనుకుంటూ కృష్ణ ముందుకు వస్తుంది మీరా. రా ముకుందా.. రా అంటూ కృష్ణ పైకి లేచి నిలబడుతుంది. బాధపడకు కృష్ణ.. అదర్శ్ మారతాడు, కాస్త ఓపిక పట్టు అని మీరా చెప్పగానే సరేనని కృష్ణ అంటుంది. మరోవైపు రేవతి, భవాని మాట్లాడుకుంటారు. అసలు ఆదర్శ్ ఇలా ఉండేవాడు కాదు కదా? అవసరం అయితే తను తప్పుకోవాలి అనుకునేవాడు కానీ.. ఎవరినీ బాధపెట్టేవాడు కాదు. అలాంటిది మురారీ బయటికి పో అనేంత వరకూ వచ్చేశాడంటే తనకు ఎవరో నూరిపోస్తున్నారు.. తన మనసుని ఎవరో మార్చేస్తున్నారంటూ ముకుంద కుట్రను బయటికి లాగేలా భవాని మాట్లాడుతుంది. అయితే ఆ మాటలు మీరా విని.. అమ్మో నా మీద డౌట్ వచ్చేలా ఉంది. వెంటనే మాట మార్చాలని అనుకుంటుంది. అటుగా వెళ్తున్న మధుని ఆపి.. రేపు హోలీ చేసుకుందామా అని మీరా అడుగుతుంది.

ఇక మధు, మీరా మాటలు భవాని విని..  మనం ఏ పండగలు చేసుకునేది లేదని అంటుంది.  రేపు హోలీ జరుపుకుందాం.. ఆదర్శ్, మురారీలు కలడానికి ఓ అవకాశం అనుకోండి. వాళ్లను నేను కలుపుతాను మేడమ్.. నాకు ఓ అవకాశం ఇవ్వండి అంటు మీరా మంచిగా మాట్లాడుతుంది. సరే ముకుందా.. నువ్వు ఈ ఇంటికి వచ్చాక చాలా మంచి జరిగింది. ఈ ప్రయత్నం చేసి.. వాళ్లని కలిపితే నేను చాలా సంతోషిస్తానని భవాని చెప్పి  వెళ్లిపోతుంది. ఇక మీరా అలియాస్ ముకుంద మనసులో.. ఎలాగైనా వాళ్లని కలిపి.. నాకు మంచి పేరు వచ్చేలా చేసుకోవాలని అనుకుంటుంది. మరునాడు ఉదయాన్నే కొందరు రౌడీలను కలిసి.. డబ్బు ఇచ్చి ఇంటికి వస్తుంది ముకుంద. ముకుంద కారు దిగేసరికి ఆదర్శ్ జాగింగ్‌కి వెళ్లేందుకు సిద్ధం అవుతాడు. ఇక ఆదర్శ్‌ వెళ్లిపోతుంటే.. అయ్యో ఇప్పుడు ఆదర్శ్ వెళ్లిపోతే ఎలాగ.. నేను వేసిన ప్లాన్ ఫలించాలి కదా.. ఆ ప్రయత్నంతో ఆదర్శ్ మారితే మారినట్లు. లేదంటే ఇక జీవితంలో మారడు అన్నట్లని ముకుంద మనసులో అనుకుంటుంది. ఆదర్శ్ వాకింగ్‌కి వెళ్లి వస్తానని బయలుదేర్తుంటే అతడ్ని ఆపడానికి.. ఆదర్శ్ గారు హ్యాపీ హోలీ అంటూ మీరా చేయి అందిస్తుంది. అలా ఆదర్శ్ ని కాసేపు మాటల్లో పెడుతుంది. ఇంతలో.. మీరా డబ్బు ఇచ్చిన రౌడీలు అక్కడికి వస్తారు. రేయ్ మురారీ గాడు ఎక్కడా? రేయ్ మురారీ.. రారా బయటికి అంటూ ఉంటారు. ఆదర్శ్ వాళ్లని ఎవ్వరా మీరు అంటు ఆపుతుటాడు. ఇంతలో భవాని, కృష్ణ, మురారీ, మధు, రేవతీ అంతా బయటికి వస్తారు. ఆదర్శ్ మీద రౌడీలు దాడి చేస్తుంటే మురారీ.. మురారీ మీద దాడి చేస్తుంటే ఆదర్శ్ . వాళ్లని చితక్కొట్టేస్తారు.

దాంతో రౌడీలు పారిపోతారు. వెంటనే ఆదర్శ్ మురారీతో.. నీకేం కాలేదు కదరా అంటే.. ఆదర్శ్‌తో మురారి నీకేం కాలేదు కదరా అంటాడు. అలా ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుని.. సారీ చెప్పుకుంటూ కౌగిలించుకుంటారు. వాళ్ళిద్దరిని అంతా హ్యాపీ ఫీల్ అవుతారు.  ఏసీపీ సర్ నేను చెప్పాను కదా.. ఆదర్శ్ మనసు వెన్న.. మారతాడు అన్నాను కదా.. మారాడు చూడండి. ఏం అంటావ్ ఆదర్శ్ అని కృష్ణ అంటుంది. అయితే ఆదర్శ్ మాత్రం కృష్ణవైపు కోపంగానే చూస్తాడు. మొత్తానికి అన్నదమ్ములు కలిసిపోవడంతో హోలీ జరిపిద్దామని స్వయంగా భవానీనే అంటుంది. ఆ తర్వాత ఏం  జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.