English | Telugu

Karthika Deepam 2: జ్యోత్స్నకి పారిజాతం వార్నింగ్.. కాంచన రిపోర్ట్స్ లో ఏం ఉందంటే..?

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -556 లో... జ్యోత్స్న వల్లే కాశీ స్టేషన్ కి వెళ్ళాడని పారిజాతానికి కోపం వస్తుంది. దాంతో జ్యోత్స్న చెంప చెల్లుమనిపిస్తుంది పారిజాతం. గర్వం తలకి ఎక్కితే పర్వాలేదు కానీ ఒళ్ళంతా విషంలాగా మారిందని తనపై కోప్పడుతుంది పారిజాతం‌. అసలు ఇందులో కాశీని కావాలనే ఇరికించింది బావ. కాశీని పోలీసులు అరెస్ట్ చేయకుండా బావ చేయొచ్చు.. వాళ్లని ఆపొచ్చు కానీ బావ అలా చెయ్యలేదని పారిజాతాన్ని జ్యోత్స్న డైవర్ట్ చేస్తుంది.

ఆ తర్వాత శ్రీధర్ భోజనానికి వస్తున్నాడని అనసూయ అన్ని రెడీ చేస్తుంది. శ్రీధర్ గారు రావడం ఒక్కటే లేటు అని కాంచనతో అనసూయ అంటుంది. నాతో మీ నాన్నగారు అంటావ్.. దీపతో మావయ్యగారు అంటావ్.. మా అమ్మతో మాత్రం శ్రీధర్ గారు అని ఎందుకు అంటావని కార్తీక్ అంటాడు‌. ఏం అంటార్ దీప అని కార్తీక్ అనగానే.. మీ ఆయన అనాలని దీప చెప్తుంది. పిల్లల కోసం పారుని పెళ్లి చేసుకున్నాడు తాత. నా కోసం నువ్వు నాన్నతో భార్యగా ఉండలేవా అని కార్తీక్ అంటాడు.

అప్పుడే శ్రీధర్, కావేరి, స్వప్న ఎంట్రీ ఇస్తారు. సారీ పెద్దమ్మ ఇన్ని ప్రాబ్లెమ్స్ కి కారణం నేనే అని స్వప్న అనగానే నువ్వు ఏం చేసావని కాంచన అడుగుతుంది. కాశీని పెళ్లి చేసుకున్నాను కదా.. ముఖ్యంగా నా వల్ల దీప వదిన ఎక్కువ బాధపడిందని స్వప్న అంటుంది.

మరొకవైపు సుమిత్రకి కాళ్ళునొప్పులు ఉన్నాయని దశరథ్ కాళ్ళు మసాజ్ చేస్తాడు. అప్పుడే డాక్టర్ ఫోన్ చేస్తాడు. దాంతో దశరథ్ పక్కకి వెళ్లి మాట్లాడుతాడు. రేపు వచ్చి రిపోర్ట్స్ తీసుకోండి అలాగే డాక్టర్ మీతో మాట్లాడతారని చెప్పగానే ఏమైందో ఏమోనని దశరథ్ కి ఇంకా టెన్షన్ అవుతుంది.

మరొకవైపు అందరు భోజనం చేస్తుంటారు. అసలు కాశీ అలా అవ్వడానికి కారణం మీరేనని శ్రీధర్ తో కాంచన అంటుంది. మీరు మావయ్యగా వాడి మీద అధికారం చెలాయించాలనుకున్నారు.. వాడికి ఎలా ఉంటుందని కాంచన కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.