English | Telugu

Illu Illalu Pillalu: వెక్కి వెక్కి ఏడ్చిన ప్రేమ.. ఆ విషయం చెప్పకుండా ఆగిపోయిన వేదవతి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu Illalu Pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-353 లో.. జరిగింది తల్చుకొని రామరాజు ఫ్యామిలీ అంతా భాదపడుతుంటారు. అప్పుడే ప్రేమ బయట నుండి ఏడుస్తూ వస్తుంది. పెద్దబావ అని ప్రేమ ఏదో చెప్పబోతుంటే .. ఆపమ్మా.. ఇందాక నువ్వు మాట్లాడిందంతా విన్నాను.. నువ్వేంటో అర్థమైంది.. మీ వాళ్లు తప్పు చేసినా సరే మీ వాళ్ళకే సపోర్ట్ చేస్తావని అర్థమైంది. ఇక నువ్వు సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదమ్మా అంటాడు. ఇక తను సాగర్ దగ్గరికి వెళ్ళి చెప్పాలనుకుంటుంది. తను కూడా అలాగే అంటాడు. ‌

ఇక రామరాజు దగ్గరికి వెళ్ళి.. మామయ్య.. నన్ను క్షమించు అని ప్రాధేయపడుతుంది. నువ్వు.. మీ నాన్న అన్నవన్నీ నిజమే.. ఆడపిల్లని సరిగ్గా పెంచడం చేతకాని ఓ తండ్రిని అమ్మ నేను అని రామరాజు అనగా.. అయ్యో మామయ్య అంటూ ప్రేమ అంటుంటే రామరాజు ఎమోషనల్ అవుతాడు. ఇక ఆ తర్వాత వేదవతి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగుతుంది ప్రేమ. నలుగురిలో ఈ ఇంటి ఆడపిల్ల పరువు తీసి నాకు కడుపు కోతని మిగిల్చావ్.. మా కూతిరిని ఎలా పెంచామో మాకు తెలుసు.. ఎంత పద్దతిగా పెంచామో మాకు తెలుసు.. ఆ వెదవ నా కూతరికి ఏదో మందుపెట్టాడు. మాయమాటలు చెప్పి మోసం చేశాడు. గుమ్మమే దాటని కూతురు వాడిని ప్రేమిస్తుందా.. నా కూతురు ఏ తప్పు చేయలేదని ప్రేమతో వేదవతి అంటుంది. ఆడపిల్లని ఎలా పెంచాలో మీ వాళ్ళకి తెలియదు కాబట్టే నువ్వు లేచిపోయావని నోటి దాటాక వచ్చింది.. కానీ వేదవతి ఆగిపోయింది వెంటనే.. ఇక తనని తిట్టి వేదవతి వెళ్తుంది. ‌ఇక ప్రేమ ఏడుస్తూ వెళ్లిపోయింది.

శ్రీవల్లి దొంగచాటుగా ఇంటి నుండి బయటకు వెళ్తుంది. అప్పుడే చెట్ల వెనుక దాక్కున్న భాగ్యం, ఆనందరావు పిలుస్తారు. మమ్మీ నువ్వు సూపర్ మమ్మీ.. నువ్వు చెప్పినట్లే వేదవతి, నర్మద, ప్రేమ మధ్య గొడవలు మొదలయ్యాయని భాగ్యంతో శ్రీవల్లి చెప్తుంది. ఇదే సరైన సమయం.. నువ్వు వాళ్ల మధ్య గొడవ పెంచమని చెప్తుంది. కాసేపు అందరు సరదాగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ధీరజ్ దగ్గరకి ప్రేమ వెళ్ళి ఏడుస్తుంది‌. అత్త ఎలా అందో విన్నావా అంటూ ప్రేమ అనగానే.. చాలు ఆపేయ్ నీ నాటకం.. అక్కడ అలా నటించావ్.. ఇక్కడ ఇలా నటిస్తున్నావని ధీరజ్ అంటాడు. దాంతో ప్రేమ ఏడ్చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.