Read more!

English | Telugu

బికినీలో హరితేజ.. అవాక్కైన నెటిజన్లు! 

హరితేజ.. అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై తనదైన ముద్రని వేసుకున్న నటి, యాంకర్. హరితేజ యాంకర్ గా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుని ఇప్పుడు మంచి ఆఫర్స్ తో బిజీగా ఉంటుంది. అయితే  హరితేజ తన గత ఏడాది ఆడపిల్లకి జన్మనిచ్చిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం హరితేజ తన కూతురు భూమితల్లిని చూసుకుంటూ సమయం గడుపుతుంది. తనకి సంబంధించిన విషయాలన్నింటిని హరితేజ ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తుంది. అలాగే హరితేజ ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తను పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మరాయి.

సీరియల్స్ తో మొదలైన తన కెరీర్.. టీవీ షోస్, యాంకరింగ్ అంటూ బిజీ లైఫ్ ని  లీడ్ చేస్తుంది. ఇలా ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ మొదటి సీజన్ లోనే ఎంట్రీ ఇచ్చి.. తన అటతీరు, మాటతీరుతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసి తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ అందరి మెప్పు పొందింది. వీటితో పాటుగా డాన్స్ షోలలో సైతం తన డాన్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది హరితేజ. నితిన్, సమంత నటించిన 'అఆ' మూవీ లో హరితేజ చేసిన కామెడీకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. దాంతో పలువురి ప్రశంసలు అందుకుంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మంచి కాంప్లిమెంట్ తీసుకుంది హరితేజ.

బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా.. సమ్మర్ వస్తే చాలు వెకేషన్ కి ఎక్కడికి వెళదామా అన్నట్లుగా చూస్తారు సెలబ్రిటీలు. కొందరైతే వెకేషన్ కి ఏకంగా దేశాలు దాటే వెళ్తున్నారు. అలా దేశాలు దాటి పోయేవారి లిస్ట్ లోకి హరితేజ చేరింది. కూతురు భూమితల్లితో కలిసి సమ్మర్ వెకేషన్ కి ఇండోనేషియా వెళ్ళింది. ఎప్పుడు ట్రెండీ డ్రెస్లు వేయడానికి ఇష్టపడని హరితేజ.. ఇప్పుడు తన రూట్ మార్చింది. ఏకంగా బికినీలో ఫోజులిస్తూ కొన్ని ఫొటోస్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అయితే హరితేజని ఆ ఫోటోలలో చూసిన నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు. నిన్న మొన్నటి దాకా బాగానే ఉన్నావ్ కదా? ఇప్పుడేంటి ఇలా తయారయ్యావ్ అంటూ నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు నైస్ అంటూ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. అయితే నెటిజన్లు పెట్టిన కామెంట్లకి హరితేజ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.