Read more!

English | Telugu

సినిమా రేంజ్ థ్రిల్ ని పంచుతున్న ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -68 లో.. సీతాకాంత్  ప్లాన్ ప్రకారం సిరి, ధనల పెళ్లి చేయాలని గుడికి తీసుకొని వస్తాడు. శ్రీలత, సందీప్ లు మాత్రం వాళ్ళు పెళ్లి చేసుకోలేదన్న విషయం బయట పెట్టాలని ట్రై చేస్తుంటారు. శ్రీలత కావాలనే మాట్లాడుతుంది. ఈ ఇంటి కోడలు కులదైవానికి హారతి ఇవ్వాలని శ్రీలత చెప్పగానే.. రామలక్ష్మి ఇబ్బందిపడుతుంది.

నా కూతురేంటి ఇబ్బంది పడుతుంది.. కొంపదీసి వీళ్ళు పెళ్లి చేసుకోలేదా ఏంటని మాణిక్యం అనుకుంటాడు కానీ ఇబ్బంది పడుతూనే రామలక్ష్మి హారతి ఇస్తుంది. ఆ తర్వాత మంగళ సూత్రానికి బొట్టు పెట్టుకుంటుంది. ఆ తర్వాత అందరు స్వామి దగ్గరికి వెళ్తారు. సిరి జాతకమని స్వామికి ఇస్తాడు సీతాకంత్. ఏం చేస్తున్నావ్ సిరికి ఏదో దోషం ఉందని చెప్పి.. పెళ్లి అంటున్నావని శ్రీలత అంటుంది. నా కూతురు విషయాలన్ని నాకు  తెలియాలని శ్రీలత అంటుంది. సిరి జాతకం లో పెద్ద గండం ఉందని సీతాకాంత్ అనగానే.. శ్రీలత టెన్షన్ పడుతుంది. ఆ దోషం గురించి సీతాకంత్ అందరికి వివరిస్తాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదు దానికి పరిహారం ఉందని స్వామి అంటాడు. ఆ అమ్మాయి పెళ్లిలో.. అమ్మాయి అత్తామామలతో కన్యాధానం చేయించండి అప్పుడు దోషం తొలగిపోతుందని స్వామి చెప్తాడు. సిరి ప్రెగ్నెంట్ అని నేను చెప్పినట్టు వింటున్నాడని అనుకున్నాను కానీ అసలు విషయం ఇదా అని మాణిక్యం అనుకుంటాడు.

ఇప్పుడే సిరికి పెళ్లి చేయడానికి మంచి ముహూర్తం ఉందని స్వామి చెప్తాడు. ఇప్పుడు పెళ్లి చెయ్యాలని సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటాడు. దాంతో నేను ఒప్పుకోనని మాణిక్యం అనగానే.. నువ్వు ఇలా చేస్తావని తెలుసు.. అందుకే సిరి పెళ్లి నీతో కాదు వేరే ఒకరితో అని ఒక ఫ్యామిలీనీ పిలుస్తాడు సీతాకాంత్. అతనే అబ్బాయని చెప్పాగానే అందరు షాక్ అవుతారు.. కానీ సిరి ఒప్పుకోదని మాణిక్యం అనగానే.. నేను ఒప్పుకుంటున్నానని సిరి అంటుంది. ఇక నాకు, నీ కూతురు కూడా అవసరం లేదని మాణిక్యంతో సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.