Read more!

English | Telugu

భార్యని డైవర్ట్ చేయాలని చూస్తున్న భర్త.. తను ప్రియుడిని మరచిపోగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -100 లో.....రామలక్ష్మికి శ్రీలత ఫోన్ చేసి.. అభి అరెస్ట్ అయ్యాడని చెప్పడంతో కంగారుగా సీతాకాంత్ దగ్గరికి వచ్చి అభి గురించి చెప్పి స్టేషన్ కి వెళదామని అంటుంది. దాంతో సీతాకాంత్ సరే అని పక్కకి వెళ్లి అభిని అరెస్ట్ చేసిన అతనికి ఫోన్ చేసి.. నేను చెప్పినట్టు చెయ్ అని చెప్తాడు.

మరొకవైపు రామలక్ష్మికి అభి మెసెజ్ చేసి.. సీతాకాంత్ అరెస్ట్ చేయించాడని చెప్పాలని ఫోన్ తీస్తాడు. అప్పుడే అరెస్ట్ చేసిన సర్ వచ్చి ఫోన్ లాక్కొని.. పక్కకి వెళ్లి అభి చేసినట్టుగా, నేను వర్క్ మీద బయటకు వచ్చాను.. ఫోన్ చేయడానికి ఇక్కడ సిగ్నల్ లేదని రామలక్ష్మికి మెసేజ్ చేస్తాడు. మరొకవైపు రామలక్ష్మి ఆ మెసేజ్ చూసి రిలాక్స్ అవుతుంది. అప్పుడే సీతాకాంత్ వచ్చి పదా వెళదామని అనగానే.. అవసరం లేదు సర్ అభి మెసేజ్ చేశాడని రామలక్ష్మి అంటుంది. అవునా నేను చెప్పాను కదా అని సీతాకాంత్ అంటాడు. మరి నాకు ఫోన్ చేసింది ఎవరని రామలక్ష్మి అంటుంది. నీ ఫోన్ ఇవ్వు ఎవరో కనుక్కుంటానని సీతాకాంత్ రామలక్ష్మి ఫోన్ తీసుకొని తనకి వచ్చిన నెంబర్ కి కాల్ చేస్తాడు. సందీప్ లిఫ్ట్ చేసి సైలెంట్ గా ఉంటాడు. ఎవరో కానీ ఇంకొకసారి ఇలా చెయ్యకండి అంటూ సీతాకాంత్ వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత అభి నుండి ఫోన్ రాకుంటేనే ఇలా కంగారు పడుతుంది.. అభి ఆలోచనలు రాకుండా రామలక్ష్మిని మార్చాలని సీతాకాంత్ అనుకుంటాడు.

మరుసటి రోజు ఉదయం రామలక్ష్మి లేచేసరికి తన చుట్టూ బుక్స్ ఉంటాయి.. అవి చూసి సీతాకాంత్ ని ఎక్కడివి అని రామలక్ష్మి అడుగుతుంది. నీ కోసమే.. ఇక నుండి బాగా చదువు అని సీతాకాంత్ సజెషన్ ఇస్తాడు. ఆ తర్వాత సందీప్ కి కాఫీ తీసుకొని వస్తుంది శ్రీవల్లి. అతని పక్కన కొత్త మొబైల్ ఉండడంతో ఎవరితో అయిన మాట్లాడుతున్నాడా అని డౌట్ గా లాస్ట్ నెంబర్ కి కాల్ చేస్తుంది. అది రామలక్ష్మికి వెళ్తుంది. వెంటనే సందీప్ లాక్కుంటాడు. రామలక్ష్మి ఫోన్ సీతాకాంత్ లిఫ్ట్ చేస్తాడు. ఆ తర్వాత అభి ఫ్రెండ్ సీతాకాంత్ ని కలవడానికి వస్తాడు. శ్రీలత ఎందుకు వచ్చావని అడుగగా.. అభి కన్పించడం లేదని చెప్తాడు. సీతాకాంత్ అరెస్ట్ చేయించాడు.. వాడినే అభి గురించి అడగడానికి వచ్చావా అని శ్రీలత అంటుంది. అభి ఎక్కడున్నాడో కనుక్కో నేను బయటకు తీసుకొస్తానని శ్రీలత అంటుంది. సీతాకాంత్ వస్తున్నాడు వెళ్ళు అని శ్రీలత పంపిస్తుంది కానీ అభి ఫ్రెండ్ ని సీతాకాంత్ చూసి వార్నింగ్ ఇస్తాడు. అతని ఫోన్ తీసుకుంటాడు. ఎక్కడ తన నెంబర్ చూస్తాడోనని శ్రీలత టెన్షన్ పడుతూ వచ్చి.. కవర్ చేస్తుంది. ఇంకొకసారి రాకని సీతాకాంత్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.