Read more!

English | Telugu

Brahmamudi : కేసు విత్ డ్రా చేసిన అనామిక.. వాళ్ళిద్దరికి వార్నింగ్ ఇచ్చిన అక్కాచెల్లెళ్ళు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -397 లో.. అనామిక చేసిన పనికి దుగ్గిరాల ఇంట్లోని వాళ్లందరిపై కనకం అరుస్తుంది. నాకు న్యాయం కావాలి కానీ నేను తగ్గును.. నా కూతురిని నాకు తీసుకొని రండి. ఆ లోపే ఇక్కడే నట్టింట్లో కూర్చొని ఉంటానని కనకం అంటుంది. మరొకవైపు అనామిక పేరెంట్స్ పోలీస్ స్టేషన్ కి వస్తారు. నా కూతురికి ఎంత కష్టం వస్తే పోలీస్ స్టేషన్ వరకు వస్తుందంటూ అనామిక తండ్రి అంటాడు. నీ కూతురు అన్నిటిని భూతద్దంలో పెట్టి చూస్తుందని కావ్య అంటుంది.

అ తర్వాత అప్పు మోజులో పడి కళ్యాణ్ నా కూతురిని సరిగ్గా చూసుకోవడం లేదని అనామిక పేరెంట్స్ అంటు ఉంటారు. వాళ్ళు మంచి ఫ్రెండ్స్ మాత్రమే.. మీరు వాళ్ళని అపార్థం చేసుకోకండని రాజ్ అంటాడు. ఇదంతా నువ్వే చేస్తున్నావా? అనామికని వదిలించుకొని.. నీ చెల్లిని కళ్యాణ్ కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నావా అని అనామిక వాళ్ళ తల్లి కావ్యతో అనగానే.. అలా చేసేదాన్నైతే పెళ్లిలో మీరు డబ్బులు ఇవ్వాల్సినతను డబ్బులు ఇస్తేనే పెళ్లి జరగనిస్తానని చెప్పినప్పడు.. అప్పుడే పెళ్లి ఆగిపోయేది కానీ నేను మా అయనకి చెప్పి డబ్బులు కట్టించి పెళ్లి జరిగేలా చేశాను. మీరు ఇప్పుడు మీ కూతురిని పిలిచి కేసు విత్ డ్రా చేయిస్తారా లేదా.. లేదంటే మీరు చేసిన భాగోతలు చెప్పి మిమ్మల్ని లోపల ఉంచి వాళ్ళని బయట ఉంచడానికి.. మా అయనకు ఎంత టైం పట్టదని కావ్య వార్నింగ్ ఇవ్వగనే బయపడిన అనామిక పేరెంట్స్.. అనామిక కి ఫోన్ చేసి రమ్మని చెప్తారు.

కాసేపటికి అనామిక రాగానే కేసు విత్ డ్రా చెయ్యమని చెప్తారు. నేను చెయ్యనని అనామిక అనగానే.. ఇప్పుడు నువ్వు చెయ్యలేదంటే.. మన గురించి మొత్తం బయటపడుతుందంటూ అనామికను వాళ్ళు ఒప్పిస్తారు.. అనామిక స్టేషన్ లోకి వెళ్ళగానే లోపల ఉన్న కళ్యాణ్.. అప్పుకి టీ ఇస్తుంటాడు. అది చూసిన అనామికకి ఇంకా కోపం వస్తుంది. కేసు విత్ డ్రా చేసి వెళ్ళిపోతుంది. మరొకవైపు అందరు ఇంటికి వెళ్తారు. అప్పుని కనకం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకొకసారి నా కూతురు పైన ఇలాంటి నిందలు వేస్తే మర్యాదగా ఉండదంటూ కనకం వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. అ తర్వాత కావ్య కూడా తన చెల్లి పైన ఇలాంటి బురద జల్లే ప్రయత్నం చేస్తే బాగుండదంటు అనామిక, ధాన్యలక్ష్మిలకి స్వప్న, కావ్య ఇద్దరు వార్నింగ్ ఇస్తారు. ఆ తర్వాత అనామిక వెళ్తుంటే.. స్వప్న పిలుస్తుంది. స్టేషన్ లో అప్పుకి కళ్యాణ్ టీ తీసుకొని వచ్చాడంట కదా అని స్వప్న అనగానే అనామికకి కోపం వస్తుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.