English | Telugu
ఆమె చూపులు ఎవ్వరినైనా చంపేస్తాయి!
Updated : Aug 19, 2022
అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గ్లామరస్ యాంకర్ గా ఎంతో పేరు ఉంది. అలాగే మూవీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. అనసూయ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ఫాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు అనసూయ వీడియో ఒకటి ఫుల్ వైరల్ అవుతోంది. శ్రావణ సందడి స్పెషల్ షోలో భాగంగా చిలకపచ్చ చీర కట్టుకుని హోస్ట్ చేసిన ఆ వీడియో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.
ఐతే ఒక డై హార్డ్ ఫ్యాన్ చిన్నపిల్లాడి వీడియో పెట్టి అనసూయని చూస్తూ వెళ్లి కింద పడినట్టు పోస్ట్ చేసింది. ఎత్తైన ప్లేస్ నుంచి ఓ చిన్న పిల్లాడు సైకిల్ తొక్కుతూ వస్తుంటాడు. అదే టైంకి అనసూయ కళ్ళెగరేస్తూ చిన్న నవ్వు నవ్వేసరికి ఆ పిల్లాడి మైండ్ బ్లాంక్ ఐపోతుంది. అంతలోనే సైకిల్ బోల్తా కొట్టి పిల్లాడు కింద పడిపోతాడు. అనసూయ అందానికి ఎవ్వరైనా సరే ఫిదా కావాల్సిందే అనే కోణంలో కొంత మంది అభిమానులు ఈ విధంగా వీడియోను డిజైన్ చేశారు. ఆ వీడియోను అనసూయ తన ఇన్స్టా స్టోరీస్ స్టేటస్ లో షేర్ చేసింది. బాడీ షేమింగ్ కామెంట్లు, ట్రోల్స్, రెమ్యూనరేషన్ వంటి కారణాలతో లేటెస్ట్ గా ఈ బ్యూటీ `జబర్దస్త్` నుంచి తప్పుకుంది. ఇక ఇప్పుడు సుడిగాలి సుధీర్ తో నటించిన మూవీ 'వాంటెడ్ పండుగాడ్'లో నటించింది.